//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ ప్లాన్ ... మల్కాజ్ గిరి ఎంపీగా ఆ సీనియర్ ఐఏఎస్

Category : state politics

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 17 సెగ్మెంట్లలో 16 స్థానాలు కైవసం చేసుకోవాలని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచి ఆ స్థానంలో ప్రకటించి పోయే అభ్యర్థులపై దృష్టి సారించారు.సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సీఎం కేసీఆర్ ఈసారి మల్కాజ్గిరి స్థానం నుండి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ లు ఎన్నికల బరిలోకి దించాలని పక్కా ప్లాన్ లో ఉన్నారట.

కేసిఆర్ గౌరవించే ఆ సీనియర్ మోస్ట్ ను రంగంలోకి దింపితే ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్ప వచ్చనికేసీఆర్ భావిస్తున్నారు.ఇంతకీ ఎవరా మోస్ట్ ఐఏఎస్ అధికారి అంటే ఆయన మరెవరో కాదు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మాజీ సి ఎస్ డాక్టర్ రాజీవ్ శర్మ.డాక్టర్‌ రాజీవ్‌శర్మను పార్లమెంటు బరిలో దింపేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని టీఆర్ఎస్ ముఖ్యులలో చర్చ జ‌రుగుతోంది.

ఇక మల్కాజ్గిరి స్థానం నుండి పోటీ చేయించడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. రాజీవ్ శర్మ సామాజిక వర్గానికి చెందినవారు మల్కాజ్గిరి ప్రాంతంలో ఎక్కువగా ఉండడం తో సామాజిక సమీకరణాలతోపాటు విద్యాధికులు అధికంగా ఉండే చోట రాజీవ్ శర్మ ను బరిలోకి దింపితే విజయం సునాయాసం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో మల్కాజ్గిరి స్థానం ఖాళీ అయింది. అందుకే అక్కడినుండి రాజీవ్‌శర్మను బరిలోకి దింపేందుకు కేసీఆర్‌ యోచిస్తున్నారు.

ఇక టిఆర్ఎస్ పార్టీలో మల్కాజ్గిరి స్థానంపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు లేకపోలేదు.ఇదే సీటుపై కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి కూడా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఉప్పల్‌ ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడ్డ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మెహన్‌ సైతం మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక రామ్మోహన్ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ద్వారా టిక్కెట్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే, గులాబీ ద‌ళ‌ప‌తి ఓకే చేస్తే రాజీవ్ శ‌ర్మ‌కే టికెట్ ద‌క్క‌నుంద‌ని అంటున్నారు. ఇక ఇందుకు రాజు సినిమా సామాజికవర్గమే కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ఢిల్లీలో రాజీవ్ శర్మ కు ఉన్న పరిచయాల నేపథ్యంలో ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిగా ఆ పరిచయాలు తనకు ఉపయోగపడతాయని, పార్టీకి దాని వల్ల లాభం చేకూరుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే రాజీవ్ శర్మ ను రాజకీయ నాయకుడి అవతారమెత్తించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాజీవ్ శర్మ మీద చాలా గౌరవం ఉంటే కేసీఆర్ అందుకే ఆయన రిటైర్మెంట్ అయిన వెంటనే కీల‌క‌మైన ముఖ్య స‌ల‌హాదారు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇక ఇప్పుడు పార్లమెంట్లో రాజీవ్ శర్మ పవర్ఫుల్ గళం వినిపించాలని, తెలంగాణ పవర్ చూపించాలని కెసిఆర్ భావిస్తున్నారట.