//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబు ఇచ్చిన షాక్‌తో దిక్క తోచ‌ని స్థితిలో కేసీఆర్‌..!

Category : politics state

మ‌న ఇంట్లో శుభ‌కార్యం కోసం కొబ్బ‌రికాయ కొడితే... చిప్ప త‌గిలి ప‌క్కింటోడి మూతి వాసిపోవ‌డం అంటే ఇదే. ఏపీలో ఏకంగా 20 వేల పోస్టులు భ‌ర్తీ చేసేందుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అస‌లే మంట‌మీద ఉన్న తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు కేసీఆర్ మీద తిరుగుబాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. టీఆర్ఎస్‌ను వంద అడుగుల లోతులో పాతిపెడ‌తామంటున్నారు. 

కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక 20వేలు కాదు క‌దా.. క‌నీసం రెండు వేల పోస్టులు కూడా భ‌ర్తీ దాఖ‌లాలు లేవు. మీకు ఉద్యోగాలు వ‌స్తాయ్‌.. ఉన్న‌ట్టుండి లక్ష ఉద్యోగాలు ఊడిప‌డ‌తాయ‌ని రోడ్డుకెక్కించి ఆగ‌మాగం  చేసిన కేసీఆర్ తెలంగాణ యువ‌త కోపంగా ఉంద‌ని  కొన్ని వ‌ర్గాలు అనే మాట‌. క‌నీసం, నామ్‌కే వాస్తేగానైనా.. నోటిఫికేష‌న్ అయితే రాలేదు. ఏం పీ..తారులే అని కేసీఆర్ నిరుద్యోగుల‌ను ప‌ట్టించుకోలేద‌ని తెలుగు త‌మ్ముళ్లు పెద‌వి విరుస్తున్నారు. 

ప‌క్క‌న ఏపీని చూస్తేనేమో ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు డీఎస్సీలు ప‌డ్డాయి. మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. అది కూడా చిన్నా చిత‌కాదేం కాదు.. 9వేల పోస్టులు. ఇక గ్రూప్ - 1, గ్రూప్ - 2 నోటిఫికేష‌న్లు కూడా అంతే. మూడో నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చేసింది ఐదేళ్ల‌లో. 

లోటు బ‌డ్జెట్ ఉన్నా.. చేతిలో పైస‌లు లేక‌పోయినా రాజ‌ధానితో స‌హా అన్నీ క‌ట్టుకుంటున్నాడు. కానీ, కేసీఆర్ మాత్రం సంపన్న తెలంగాణ అంటూ బంగారుప‌ల్లెం చూపిస్తున్నాడు కానీ.. ప్ర‌జ‌లు మాత్రం ఆక‌లితో అల‌మటిస్తున్నారని తెలంగాణ తెలుగు త‌మ్ముళ్లు అంటున్న మాట‌.