//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ అన్న మాట‌ల‌తో క‌న్నీరు పెట్టుకున్న మ‌హిళా నేత‌..!

Category : state

ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక పార్టీ నుంచి ఒక్క‌రే పోటీ చేయాలి. కానీ టిక్కెట్ కోసం మాత్రం ఎంత‌మంది నేత‌లైనా పోటీ ప‌డొచ్చు. ప్ర‌య‌త్నాల‌ను చేయొచ్చు. ఇప్పుడు చొప్పందండి నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్‌లో జ‌రుగుతోంది కూడా అదే అట‌. టీఆర్ఎస్ టిక్కెట్ ఒక్క‌రికే ఇస్తారు. కానీ ఇద్ద‌రు నేత‌లు టికెట్ ప్ర‌య‌త్నాల‌ను తెగ సీరియ‌స్‌గా చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా ఆ ఇద్ద‌రు మాత్రం నాకే టికెట్ అంటూ.. నాకే టికెట్ అని ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించేశారు. పైగా వారిలో ఒక‌రు తాజా మాజా ఎమ్మెల్యే. ఇక అద్దిరిపోయే స‌స్పెన్స్ గా నిల‌వ‌డానికి ఇంత‌కు మించిన స్ట‌ఫ్ ఇంకేముంటుంది. ఇంత‌కీ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎవ‌రి వైపు మొగ్గు చూప‌బోతున్నారు.? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

తెలంగాణ ఎన్నిక‌ల వార్‌లో అన్ని పార్టీల‌కంటే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంలో ప్ర‌చార ప‌ర్వాన్ని ప‌రుగులు పెట్టించ‌డంలో టీఆర్ఎస్ ముందుంది. కేవ‌లం 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది తెలంగాణ రాష్ట్ర స‌మితి. అందులో న‌లుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మిగిలిన పార్టీల‌క‌న్నా ఎన్నిక‌ల స‌మ‌రంలో టీఆర్ఎస్ ఒక‌వైపు దూసుకుపోతుంటే మ‌రో వైపు ఆ పార్టీ కేంద్రంగానే టెన్ష‌న్ కూడా అదే స్థాయిలో రాజుకుంటోంది. ఈ 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులుగా కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తార‌న్న కోణం గులాబీదండులో వేడి రాజేస్తుంది.

ఆ 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో చొప్ప‌దండి కూడా ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో బొడిగ శోభ ఇక్క‌డ్నుంచి విజ‌యం సాధించారు. తాజా, మాజీ ఎమ్మెల్యే కాట్టి త‌నకు టిక్కెట్ గ్యారెంటీ అని శోభ ధీమాతో ఉన్నార‌ట‌. కానీ, 105 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన తొలి జాబితాలో చొప్ప‌దండికి చోటివ్వ‌లేదు కేసీఆర్‌. ఆ త‌రువాత ప్ర‌క‌టించిన మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ చొప్ప‌దండికి అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయినా, త‌న‌దే టికెట్ అన్న కాన్ఫిడెన్స్‌ను శోభ ప్ర‌ద‌ర్శిస్తుంటే టిక్కెట్ నాదే కాబ‌ట్టి ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టేశాన‌ని మ‌రో లీడ‌ర్ రంగంలోకి దిగిపోయార‌ట‌. ఇటు శోభ కూడా ప్ర‌చార ప‌ర్వానినికి తెర తీయ‌డంతో చొప్ప‌దండి టీఆర్ఎస్ ముఖ చిత్రం సెగ‌లు కక్కుతోంద‌ట‌.

అయితే, చొప్ప‌దండి తాజా మాజీ ఎమ్మెల్యే శోభ‌కు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్ వ్య‌తిరేకంగా ఉంద‌ట‌. ఈ విష‌యాన్నే త‌న ఫ్లాష్ స‌ర్వే ద్వారా తెలుసుకున్న కేసీఆర్ ఎమ్మెల్యే బొడిగ శోభ‌కు ఫోన్ చేసి మ‌రీ చెప్ప‌డ‌మే కాకుండా.. చీవాట్లు పెట్టార‌ట‌. గ‌త నాలుగున్న‌రేళ్ల కాలంపాటు టీఆర్ఎస్‌పై చొప్ప‌దండి ప్ర‌జ‌ల్లో భారీ వ్య‌తిరేక‌త పెంచావ‌ని, నీవ‌ల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదంటూ క్లాస్ పీకార‌ట‌. కేసీఆర్ ఫోన్ చేసి మ‌రీ చీవాట్లు పెట్ట‌లేని బొడిగ శోభ ఆ పార్టీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ముందు ఈ విష‌యాన్ని చెప్పుకుని క‌న్నీరు మున్నీరైంద‌ట‌. ఆ క్ర‌మంలోనే ఈ సారి ఎమ్మెల్యే టికెట్‌ను బొడిగ శోభ‌కు కాకుండా.. ర‌విశంక‌ర్ కు ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గుచూపుతున్న‌ట్టు టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు.

Related News