//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బడ్జెట్ ప్రవేశపెట్టేది కేసీఆర్ నేనా ... మంత్రి వర్గ విస్తరణ బడ్జెట్ ముందు లేనట్టేనా

Category : politics state

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఊహించని షాక్ ఇవ్వ‌నున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఆర్థిక మంత్రి లేకుండా తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంత‌కుమునుపే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నారు గానీ ప‌రిస్థితులు మాత్రం అలా క‌నిపించ‌డం లేదు. ఎన్నో విమర్శలు ఎదురవుతున్నా త‌న అహం సంతృప్తి ప‌ర‌చుకోవ‌డానికి విల‌క్ష‌ణ రాజ‌కీయాలు చేసే కేసీఆర్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల వివ‌రాలు ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 22 నుంచి – 25వ తేదీ వరకు బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 22వ తేదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 23న బడ్జెట్ పై చర్చ, 25న ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అంటే మ‌రో ఏడు రోజుల్లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేయాలి. లేదంటే… ముఖ్య‌మంత్రే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తారు. ఇది జ‌రిగితే ఎప్ప‌టికీ ఇది ఒక సంచ‌ల‌నంగా నిలిచిపోతుంది.

వాస్త‌వానికి ఒక నెల ముందు నుంచే ఆర్థిక మంత్రులు బ‌డ్జెట్‌పై స‌న్నాహాలు చేసుకుంటారు. కానీ మ‌రో ఏడు రోజులే మిగిలి ఉంది… కానీ ఆర్థిక మంత్రే లేడు. అంటే దీన్ని బ‌ట్టి బ‌డ్జెట్ కేసీఆర్ ముఖ్య‌మంత్రి హోదాలో ప్ర‌వేశ‌పెడ‌తార‌నే అంటున్నారు. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌కు *అంతా తానే* అనే ఒక ఇంప్రెష‌న్ వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అస‌లు ఇంత‌వ‌ర‌కు మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ చేయ‌క‌పోవ‌డ‌మే ఒక వింత అయితే ఇక మొద‌టి స‌మావేశాల్లో అది కూడా బ‌డ్జెట్ స‌మావేశాలు మంత్రులు లేకుండా నిర్వ‌హించ‌డం ఇంకా పెద్ద వింత అవ‌నుంది. అయితే ఈ తరహా సంచలనాలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్.

తాజా స‌మాచారం ప్ర‌కారం… ఈసారి మంత్రి ప‌ద‌వులు తీసుకున్న వారికి అవేమీ ప్ర‌మోష‌న్లుగా ఉండ‌వ‌ని… రెండోసారి టీఆర్ఎస్ గెల‌వ‌డంతో కేసీఆర్‌-కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌తి రూపాయి ఖ‌ర్చు జ‌ర‌గాలి, ప్ర‌త్యేక టార్గెట్లు ఉండాలి అన్న అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా సెక్యూరిటీ పెర‌గ‌డం త‌ప్ప ఇత‌ర ప్ర‌యోజ‌నం ఏదీ ఉండ‌దు అనేది పార్టీ శ్రేణులు లోనే ఉన్న ఒక భావన. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కానీ మంత్రివర్గ విస్తరణ విషయాల్లో మాత్రం కెసిఆర్ తన నిర్ణయాన్ని ఏమీ వ్యక్తం చేయలేదు. దీంతో బడ్జెట్ కేసీఆర్ ప్రవేశ పెడతారు అన్న టాక్ పార్టీ శ్రేణులలో వినిపిస్తోంది.