//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆంధ్రా అభిమాని త‌న‌... క‌ట్ చేసుకున్నాడు..!

Category : politics state

పొలిటిక‌ల్‌గా భారీ సంఖ్య‌లో అభిమానుల‌ను సొంతం చేసుకున్న అతి కొద్ది మంది ముఖ్య‌మంత్రుల్లో.. తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఒక‌రు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఆయ‌న పుట్టిన పుట్టిన రోజుతోపాటు, ఆయ‌న ఏ సంక్షేమ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టినా కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  కేవ‌లం కేసీఆర్ పుట్టిన రోజులు, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసిన రోజ‌నే కాకుండా, ఆయన మ‌రోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించాలంటూ మ‌రికొంద‌రు ప‌లు ర‌కాలుగా వారి అభిమానాన్ని తెలుపుతున్నారు.

ఇదే కోవ‌లో, తూర్పు గోదావ‌రికి చెందిన ఓ వ్య‌క్తి కేసీఆర్ ముందస్తు ఎన్నిక‌ల్లో గెలుపొంది మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావాలంటూ త‌మ ప్రాంతంలోని స‌త్య‌నారాయ‌ణ స్వామి  ఆల‌యంలో  101 కొబ్బ‌రి టెంకాయ‌ల‌ను కొట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌రొక అభిమాని తెరాస విజ‌యాన్ని కోరుతూ తెలంగాణ‌, ఆంధ్రా ప్రాంతాల్లో సైకిల్‌పై ప్ర‌చారం చేశాడు. ఇలా ప‌లువురు వారికి తోచిన ఆలోచ‌న‌తో కేసీఆర్‌పై త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

ఇదిలా ఉండ‌గా, కేసీఆర్‌పై అభిమానంతో మ‌రో వ్య‌క్తి చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొబ్బ‌రి కాయ‌లు, సైకిల్ తొక్క‌డంలాంటివి కాకుండా, ఏకంగా త‌న నాలుక‌నే కోసేసుకున్నాడు. ఆపై తన నాలుక‌ను ఆల‌యంలోని హుండీలో వేసేశాడు. గ‌మ‌నించిన స్థానికులు అత‌డు శ్రీ‌న‌గ‌ర్‌కు చెందిన మ‌హేష్‌గా గుర్తించారు. మ‌హేష్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ మొద‌లు పెట్టారు.

Related News