తెలంగాణ ఎన్నికలు రోజు రోజుకు రాజకీయ కాకను రేపుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు వారి వారి అభ్యర్థుల గెలుపుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అస్త్రాలుగా వ్యూహాలను రచిస్తున్నారు. రోజుకొక సర్వేను చేస్తున్నారు. తమ అభ్యర్థి వీక్‌గా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఇలా నిత్యం రాజకీయ ప్రచారాలతో తెలంగాణ ఒక్కసారిగా హీటెక్కింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ తన నోటికి చెప్పారు. తాజాగా, కేసీఆర్ వాడుతున్న పదజాలం గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే విన్నామని.. అటువంటి పదజాలాన్ని మళ్లీ ఇటీవల కాలంలోనే వినే భాగ్యం కలిగిందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ కేసీఆర్ వాడిన పదజాలం అంత బాగుందనుకుంటే పొరపాటేనని, కేసీఆర్ ప్రసంగం సమయంలో నోరు తెరిచిన వెంటనే.. పిల్లల చెవులు మూస్తే.. వారు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారని, అంతటి అసభ్య పదజాలంతో సీఎం కేసీఆర్ ప్రసంగాలు ఉంటున్నాయన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
ఈ క్రమంలోనే, ఏపీ సీఎం చంద్రబాబుపై సైతం కేసీఆర్ అసభ్య పదజాలాన్ని వాడారు. ఇంతకాలం, ఎవరూ వినని, వినకూడని పదాలన్నిటిని కలిపి తాను ఒక సీఎం స్థాయిలో ఉన్న విషయాన్ని మరిచి.. మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ప్రయోగిస్తున్నారు కేసీఆర్. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ టీడీపీ నేతలు సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చారు. తెలంగాణలో ఉండాలనుకుంటున్నావా..? లేదా.? అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు దీవిస్తే నీవు ముఖ్యమంత్రివి కాలేదు.. కేవలం తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని నీవు ముఖ్యమంత్రివి అయ్యావు. సీఎం అయిన తరువాత నీవు తెలంగాణకు ఏమైనా చేశావా..? అంటే అదీ లేదు. దోచుకోవడమే పనిగా పెట్టుకున్నావు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు. ఆ మాట తప్పి కేవలం నీ కుటుంబ సభ్యులకే మంత్రి పదవులు ఇచ్చి లక్షల కోట్ల డబ్బును వెనకేసుకున్నావు అంటూ ఘటు వ్యాఖ్యలు చేశారు.