//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం విఫ‌ల ప్ర‌యోగం..!

Category : state politics

కోదండ‌రామ్ మాష్టారు నిప్పులు చెరిగారు. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్మ‌మంత్రి కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. గ‌తంలో తాను మాట్లాడితే చాలు.. మొద‌టి పేజీ ప్రాధాన్య‌త ఇచ్చే మీడియా గ‌డిచిన కొంత కాలంగా త‌న వాయిస్‌కు ఏ మాత్రం ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నేట‌టువంటి అసంతృప్తి ఆయ‌న‌లో నిక్క‌చ్చిగా క‌నిపిస్తుంది. తాను తూల‌నాడిన ఆంధ్రా మీడియాలో ఒకానొక స‌మ‌యంలో పెద్ద ఎత్తున త‌న వార్త‌ల‌ను ప్ర‌చురించిన మీడియా సంస్థ‌లే, తాము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదే మీడియా ఆయ‌న వార్త‌ల‌ను క‌నిపించ‌ని రీతిలో ప్ర‌చురిస్తున్నా.. ఒక్క‌మాట కూడా ఆయ‌న అన‌లేని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు త‌న మెంటోవ‌ర్ అయిన కేసీఆర్‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా మారిన కోదండ‌రాం మాస్టారుకు త‌న‌దైన రాజ‌కీయ పార్టీని స్థాపించ‌డం, ఆ వేదిక త‌రుపున మాట్లాడినా పట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది మీడియా.రీసెంట్‌గా ఆయ‌న ఒక ఇంట‌ర్వ్యూ చేశారు. అందులోని ముఖ్యాంశాల‌ను ప‌రిశీలిస్తే..KCR Decision was Failed

పంక్చరైన టైర్ల‌తో కూడిన కారు కాదు మాది.. స‌మిష్టిగా నిర్మిస్తున్న ఒక వ్య‌వ‌స్థ మాది. అనేక ద‌శ‌ల‌ను దాటుకుంటూ పోవాల్సి వ‌స్తుంది. న‌లుగురితో క‌లిసి పోతాం. అలా పోవ‌డానికి మేము సిగ్గుప‌డం. తెలంగాణ కోసం అంద‌రం క‌లిసి ప‌ని చేయ‌లేదా..? టీఆర్ఎస్ ఒక్క‌టే చేసిందా..? అని ప్ర‌శ్నించారు ఆయ‌న‌. పైగా, తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం విఫ‌ల ప్రయోగ‌మ‌ని కోదండ‌రాం అభివ‌ర్ణించారు. దీంతో కేసీఆర్‌కు షాకైన‌ట్లుగా అయింది. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన తరువాత ప్ర‌జ‌లు త‌మ స‌్థుల‌ను నారా లోకేష్ ప్ర‌క‌టించేశారు. క‌ర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థిగా బుట్టా రేణుక పోటీ చేయ‌నున్నార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, సీఎం చంద్ర‌బాబుకు తెలిసే మంత్రి లోకేష్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారా..? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. KCR Decision was Failed

Related News