//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబుపై.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Category : politics

తెలంగాణ‌లో కేసీఆర్‌కు తిరుగులేదు. ప‌క్క తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం చంద్ర‌బాబు ప‌రిస్థితి క‌ష్టంగా ఉంది. ఏపీలో చంద్ర‌బాబుకు జ‌గ‌న్ గ‌ట్టిపోటీ ఇస్తున్నారు. ఇవ‌న్నీ కూడా ఒక‌ప్ప‌టి మాట‌లు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి రివ‌ర్స్ అయింది. నిజానికి తెలంగాణ‌లో కేసీఆర్‌తో పోలిస్తే.. ఏపీలో చంద్ర‌బాబు ప‌రిస్థితే మెరుగ్గా ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని మ‌రెవ‌రో చెప్ప‌లేదండి బాబూ... స్వ‌యాన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే చెప్పారు.

అయితే, ఇటీవ‌ల కొంద‌రు ముఖ్య నేత‌ల‌తో హైద‌రాబాద్ న‌గ‌ర‌ ప‌రిధిలోగ‌ల ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించిన సీఎం కేసీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశార‌ట‌. తెలంగాణ‌లో మ‌న పార్టీ గెలుపును ఆపేవారులేరు సార్‌.. ఏపీలో చంద్ర‌బాబు ప‌రిస్థితి మ‌న‌కు రివ‌ర్స్‌గా ఉంది.. ఓట‌మి ప‌క్కా సార్ అన్న నాయ‌కుల మాట‌ల‌కు కేసీఆర్ స్పందించి ఇలా అన్నాడ‌ట‌. మీరు చెప్పిన మాట‌లు ఉత్త నీటిమూట‌లే. అదంతా విష ప్ర‌చారం మాత్ర‌మే. వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయంగా ఇంకా ఎద‌గ‌లేద‌ని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఏపీని అభివృద్ధి చేసేట‌టువంటి బాధ్య‌త‌ను జ‌గ‌న్ నిర్వ‌ర్తించ‌లేర‌ని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించార‌ట‌.

చంద్ర‌బాబు అనుభ‌వం ఎక్క‌డ‌.. జ‌గ‌న్ అనుభ‌వం ఎక్క‌డ అంటూ స‌మావేశానికి హాజ‌రైన నేత‌ల‌ను కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంలోనే ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రం ఐటీప‌రంగా ఇంత అభివృద్ధి సాధించ‌డాని కార‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబేనంటూ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌ను సీఎం కేసీఆర్ రిపీట్ చేశార‌ట‌. చంద్ర‌బాబు ఉంటేనే ఏపీ ఐటీప‌రంగానే కాకుండా, అన్ని విధాల అభివృద్ధి చెందుతుంద‌ని, జ‌గ‌న్ కేవ‌లం త‌న కంపెనీల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇచ్చి ఏపీని సర్వ‌నాశ‌నం చేస్తాడు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించార‌ట‌. ఏదేమైనా, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్న‌ట్టే.. చంద్ర‌బాబు పాల‌న‌లో హైద‌రాబాద్‌లానే.. అమ‌రావ‌తి కూడా అభివృద్ది చెంద‌బోతోంది అంటూ కేసీఆర్ చెప్ప‌డం వివేషం.