//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ గాడు అనలా..!

Category : national

తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ఒక సభ లో మాట్లాడుతూ ప్రధాని ని అగౌరవ పరుస్తూ మాట్లాడారని బీజేపీ నేతలు సీఎం ఫై తీవ్రం గా విరుచుకు పడుతున్నారు . దీనిపై వివరణ ఇచ్చిన కెసిఆర్ నేను ప్రధానిని ఏమీ అనలేదని అన్నాడు.

బీజేపీ నేతలు కొంచెం అలోచించి మాట్లాడాలన్నారు. ప్రధాని మోదీని అమర్యాదగా సంబోధించాల్సిన అవసరం తనకులేదన్నారు. మోదీ గారు అనే విధంగానే మాట్లాడా అన్నారు. పెడర్థాలు తీసి ప్రధానిని గాడు అని సంబోధిస్తారా అంటే అది వారి ఇష్టం అన్నారు.

జైలుకు పంపిస్తామంటున్నారు కొందరు నేతలు అందరితోనూ రాజకీయాలు చేస్తామంటే కుదరదని ,కొందరిని ముట్టుకుంటే భస్మమవుతారన్నారు. తన జేబులో ఉన్న పెన్నుతో సహా అన్నిటికీ లెక్కలున్నాయన్నారు.

తనపై ఏం కేసులు పెడతామని అంటున్నారు అసలు తన ఫై ఏమని కేసు పెడతారని కెసిఆర్ అడిగారు . రాజకీయాలలో దొంగనాయకులు మాత్రమే బయపడతారని తమకేం భయమన్నారు . ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలకు చందాలు సహజమే అని బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలా నడుస్తాయో తమ పార్టీ కూడా అలాగే నడుస్తుందన్నారు.

Related News