//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక పీఎం కేసీఆర్ !

నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో తెలంగాణా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ తోపిక్ అయ్యాయి.

నిన్న కేసీఆర్ చేసిన తృతీయ కూటమి వ్యాఖ్యలు దేశ రాజకీయ పార్టీలలో కొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణ రాష్ట్రం కోసమే పార్టీ స్థాపించి అనేక ఉద్యమాలు చేసి పోరాడి తెలంగాణా సాధించి, ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్, దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు.

నిన్న కేసీఆర్ మాట్లాడిన విధానాన్ని, ఆయన మాటలను విశ్లేషిస్తే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న బలమైన కోరిక ఏదో ఆయన మనసులో ఉన్నట్టు కనిపిస్తోంది. "జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నేను సిద్ధమే. సమీప భవిష్యత్తులో జాతీయ రాజకీయ పరిస్థితులు మారనున్నాయి. మార్పును తీసుకువచ్చే బాధ్యతను నా భుజాలపై వేసుకునేందుకు సిద్ధం. మరో మూడు నాలుగేళ్లలో మార్పు వస్తుంది" అని కేసీఆర్ వ్యాఖ్యానించడం పై ప్రముఖ ఆంగ్ల పత్రిక 'న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' బ్యానర్ ఐటెం ని ప్రచురించింది. దీని బట్టే అర్ధం చేసుకోవ్బచ్చు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపాయో.

సదరు పత్రిక కధనం ప్రకారం ఈమధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడిని కేసీఆర్ మొదలు పెట్టారని ముఖ్యంగా రైతులకు మద్దతు ధర, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం, విభజన హామీల అమలు తదితరాల్లో కేంద్రం వైఫల్యాన్ని గుర్తు చేస్తూ కేంద్రాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆ పత్రిక విశ్లేషించింది.

అలాగే ఇప్పటికే కేసీఆర్ తమిళనాడులోని డీఎంకేతో పాటు ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ, జేడీ (ఎస్) తదితరాలతో చర్చిస్తున్నట్టు తమకు తెలిసిందని, ఢిల్లీలో ప్రధనిమంటి నివాసం ఉండే 7 రేస్ కోర్స్ రోడ్డుపై ఆయన కన్నేశారని, ప్రధానమంత్రి పదవిని అలంకరించాలన్న కోరిక ఆయనలో ఉన్నదని అభిప్రాయపడింది.

అలాగే మరో విషయం గమనిస్తే ఎప్పుడూ తమని దోచుకున్నారు, ఆంధ్రా వాళ్ళు అని వీలు చిక్కితే విరుచుకు పడే కేసీఆర్ నిన్న ఆంధ్ర ప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే అవసరం అనుకుంటే తన ప్రత్యర్ధి చంద్రబాబు తోను మాట్లాడతానని చెప్పడం చూస్తే ఆయన ప్రధాని పదవి మీద కన్నేశారు అని అర్ధం అవుతుంది.

ఎందుకంటే ఒక ట్రబుల్ షూటర్ గా చంద్రబాబు కి పేరుంది అలాగే రెండు మూడు సార్లు ప్రధాని పదవికి ఆయన సూచించిన వారినే ఎన్నిక చేశారు అనే పేరుంది దీనిని బట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా తనకి ఒకప్పుడు గురువు ఇప్పుడు ప్రత్యర్ధి అయిన చంద్రబాబు ని కలిసి తన మనసులో మాట వెల్లడించి ఆయన మద్దతు కూడా కూడగట్టుకునే అవకాసం ఉంది.

ఒక వేళ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయ్యి కేసీఆర్ కి మద్దతు ఇస్తే ప్రస్తుతానికి దేసవ్యప్తంగా ఎలాగు కాంగ్రెస్ మట్టిలో కలిసింది, బీజేపి కలవడానికి సిద్దంగా ఉంది. దాని బట్టి పీ వీ నరసింహా రావు తర్వాత మరో తెలుగు వ్యక్తి ప్రధాని పీటం అలంకరించే అవకాసం కనిపిస్తోంది.

Related News