//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ లో టార్గెట్ ఫిక్స్ చేసిన కౌశల్ఆర్మీ....!

Category : movies

బుల్లితెరని షేక్ చేస్తున్న బిగ్ బాస్ ని ఇప్పుడు కౌశల్ ఆర్మీ షేక్ చేయటానికి సన్నద్ధం కానున్నది అని సమాచారం. నిన్నటి బిగ్ బాస్ లో ఎలిమినేషన్ కి సంబంధించిన టాస్క్ కంప్లీట్ అయ్యింది. బాబు గోగినేని, గణేష్, శ్యామల, తనీష్, దీప్తి నల్లమోతు ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.

దీనితో ఎప్పటి నుండో ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న కౌశల్ఆర్మీ సభ్యులు ఇప్పటికే తమ ప్లాన్ ని అమలు చేస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకంగా ఉంటున్న బాబు గోగినేని, గణేష్, తనీష్ ముగ్గురు ఒకేసారి ఎలిమినేషన్స్ కి రావటంతో కౌశల్ ఆర్మీ వారికీ ఓట్లు రాకుండా ఏంచేయాలో అన్ని చేస్తునట్టు సమాచారం.

కౌశల్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాకముందు ఒక టివి యాక్టర్,మోడల్,యాడ్ ఏజన్సీ ఉన్న వ్యక్తి. బయట కూడా పెద్దగా ఫాలోయింగ్ లేదు. ఒక్కసారిగా బిగ్ బాస్ లో కి వెళ్ళాక తన ప్రవర్తనతో అంత మంది అభిమానులని సంపాదించుకున్నాడు. చూడాలి మరి ఈ ముగ్గురిలో వారం ఎవరు ఇంటి నుండి బయటకొస్తారో...