ఓటుకు నోటు కేసు మరోసారి తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో వాస్తవాలన్నీ చెబుతానని, తన వాదనలు తానే వినిపించుకుంటానని, ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ కేసులో ఏ4 గా ఉన్న జెరుసలేం మత్తయ్య శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు..దీంతో చంద్రబాబు మరో తలనొప్పి పట్టుకుంది.. ఈ మేరకు కత్తి మహేష్ కొన్ని ట్వీట్స్ చేశారు.. చంద్రబాబు అలాగే మోదీ ప్రభుత్వంపై కత్తి మండిపడ్డాడు..
‘‘ఓటుకు నోటు కేసులో కీలక మలుపు. కేంద్రబాబు/ చంద్రబాబుకు ప్రమాదం. మోడీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పడానికి బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమా..’’ అంటూ కత్తి మహేష్.. బీజేపీ వ్యవహారంపై ట్వీట్ చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి సంబంధించి.మోడీ ఒక నియంత. చంద్రబాబు ఒక మోసగాడు. ప్రత్యేకహోదా బీజేపీ ఇవ్వదు. తెలుగుదేశం ప్రత్యేకహోదా తీసుకుని రాదు. ఇక మిగతా విషయాల గురించి మాట్లాడదాం!” అంటూ కత్తి మహేష్ అధికారపార్టీల పై వ్యాఖ్యలు చేశాడు.