//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Category : politics

కత్తి మహేష్...ఈ మద్య సినిమా రివ్యూస్ తో పాటు పొలిటికల్ లీడర్స్ ని కూడా వదలట్లేదు.ఇక పవన్ కళ్యాణ్ మీద వేసే కామెంట్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు .

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు, కత్తి మహేష్‌కు మధ్య జరిగిన వార్ కొద్ది రోజుల క్రితం ముగిసింది. ఇరువురూ పార్టీ చేసుకుని మరీ గొడవలకు స్వస్తి చెప్పారు. అనంతరం కొద్ది రోజుల పాటు మహేష్ పవన్ గురించి పెద్దగా ఏమీ మాట్లాడలేదు.

మళ్లీ ఆయన ట్వీట్స్ చూస్తుంటే తన కత్తికి పదును పెట్టారేమో అనిపిస్తోంది.పవన్ అభిమానులు కతి మహేష్ ని చంపేస్తామని బెదిరించిన కూడా అతని ట్వీట్ ల పర్వం అపట్లేదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పవన్ తనను పట్టించుకోవడం లేదని ట్వీట్ చేసిన మహేష్ ఇవాళ(శనివారం) ఆయన బలహీనతను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.‘పవన్ కల్యాణ్ బలం ఏమిటో ఇంకా తెలియదు కానీ.. బలహీనత మాత్రం నోళ్లు అదుపులో లేని, మైండ్ లెస్ ఫ్యాన్స్.

పవన్ తన మానాన తాను ప్రత్యేక హోదా కోసం ఏవో ప్రణాళికలు చేసుకుంటూ రాజకీయంలో ఎదగాలి అనుకుంటుంటే, దానికి కూడా తూట్లు పొడుస్తూ వెళుతున్న ఫ్యాన్స్ చాలు అతను రాజకీయంగా భూస్థాపితం అవ్వడానికి’ అని ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు.