//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రామ్ చరణ్ మాట తప్పారు అంటున్న కత్తి మహేష్.....!

Category : movies

ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతం లో శ్రీరెడ్డి కు మద్దతు తెలపడం తెలిసిందే, ఆ సమయంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పై విరుచుకుపడ్డారు. ఇక కత్తి మహేష్ కు మరియు పవన్ ఫ్యాన్స్ కు మధ్య పెద్ద మాటల వివాదమే నడిచింది. అయితే చివరకు అది వారిమద్య సయోధ్యతో సర్దుకుంది. ఇప్పటికీ కత్తి మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్లు ద్వారా, తన పోస్టులతో ప్రస్తుత సినీ, రాజకీయ పరిస్థితులపై విశ్లేషణలు ఇస్తూనే ఉన్నారు.ఈకపోతే గత కొని రోజులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ ముందుకు

ధర్నా చేస్తున్నట్లు, వారిని ఆ సంస్థ వారు అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమా విషయమై నరసింహారెడ్డి గారి కుటుంబీకులకు తమ సినిమా విషయమై తనవంతుగా న్యాయం చేస్తానని మాటిచ్చిన రామ్ చరణ్, మాట తప్పారంటూ కత్తి మహేష్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. సైరా సినిమా నిమిత్తం నరసింహా రెడ్డి గారి కుటుంబీకుల పొలాల్లో షూటింగ్ చేసి, వారికి కొంత డబ్బును ఇస్తానని చెప్పి, చివరికి చరణ్ మాటతప్పారు అనేది కత్తి మహేష్ చేస్తున్న విమర్శ.

వాస్తవానికి సైరా మూవీ కి పెడుతున్న కొండంత ఖర్చు ముందు వారికి ఇవ్వాల్సింది పిసరంత కూడా ఉండదు, అలాంటపుడు చరణ్ ఎందుకు వారికి న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంటూ కత్తి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబీకులు మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారి మధ్య చిన్నపాటి వివాదాలు జరుగుతున్నాయి అనే విషయమై ఇప్పటివరకు పలు మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవడమేతప్ప, ఎక్కడా కూడా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే దీనిపై పూర్తి క్లారిటీ లేనిదే ఎమీ మాట్లాడలేమంటున్న సినీ విశ్లేషకులు.