ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అతని అభిమానుల మీద మొన్నటి వరకూ మీడియా ఛానల్ లో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేయడం జరిగింది.కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరి గొడవా రాష్ట్రం మొత్తం టీవీ ఛానళ్లలో సంచలనం సృష్టించింది అని మనకందరికీ తెలుసు. ఆ తరువాత ఇరు వర్గాలు రాజీ చేసుకోవడంతో అంతా సైలెన్స్ అయిపోయింది.
కాని కత్తి మహేష్ అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మిద ఆయనకు సంబంధించిన విషయాల మీద మెల్లమెల్లగా కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. వీటిని పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.అయితే ఈ క్రమంలో తాజాగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మిద షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆ వ్యాఖ్యలతో మహేష్ జనసేనలో చేరినట్లే అన్న ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ కత్తి మహేష్ చేసిన కామెంట్ ఏంటంటే ''ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 21నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నా మద్దతు తెలుపుతున్నాను'' అని మహేష్ ట్వీట్ చేశారు.
దీంతో కత్తి మహేష్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వాస్తవంగా జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలు చివరి నిమిషం వరకూ ఎవరికీ తెలియదు.అలాంటిది పవన్ దీక్ష చేయబోతున్నారని మహేష్ కి ఎలా తెలిసిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది.ఎవరికి చెప్పకుండా పవన్ పొలిటికల్ పార్టీలో మహేష్ చేరిపోయారేమో అణా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.