//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్ మళ్లీ కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్

Category : state movies

అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో సినీ ప్రముఖుల సమావేశం జరుగుతోంది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితులపై వారు చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కత్తి మహేష్ ఈ సమావేశం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. ఇది గమనించిన పవన్ ఫ్యాన్స్.. కత్తిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కత్తి.. దళితుడిననే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. పవన్‌కు కుల, మతాలతో సంబంధం లేదని పవన్‌ ఫ్యాన్స్‌ తేల్చి చెప్పారు. పవన్ అభిమానుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురు కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు కత్తి మహేష్‌.

అంతకు ముందు ‘నేనొస్తున్నా పవన్ కల్యాణ్’ అంటూ కత్తి ట్వీట్ చేశారు. దీనికి ట్విటర్‌లోనే ప్రతిఘటన ఎదురైంది. పవన్ ఫ్యాన్స్ ఈ ట్వీట్‌పై భారీగా స్పందించారు. అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి సి కల్యాణ్, శివాజీరాజా, జెమినీ కిరణ్, 24 శాఖల ప్రతినిధులు, అల్లు అరవింద్, ఎన్వి ప్రసాద్, హేమ, ఆదిశేషగిరి రావు, సురేందర్ రెడ్డి, శానం నాగ అశోక్, హరీష్ శంకర్, మెహర్ రమేష్, ఎన్ శంకర్, కె.ఎస్. రామారావు తదితరులు హాజరయ్యారు.