//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కత్తి మహేష్ మరో సంచలన ట్విట్...!

Category : politics

కత్తి మహేష్ ఎప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం.అయన పవన్ కళ్యాణ్ ఫై చేసిన ట్విట్ తో ఒక్క రోజు లో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు.తరువాత ఆ సమస్యను అయన పరిష్కరించుకున్నారు. ఇప్పుడు అయన చేసే ప్రతి ట్విట్ ఆసక్తి ని రేపుతున్నాయి.

కత్తి గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ కు సంభందించిన ప్రత్యేక హోదా విషయం లో వరుస ట్విట్స్ చేస్తూ, అయన కూడా నేతలు చేసే ధర్నాలలో పాల్గొంటున్నారు.ప్రత్యేక హోదా విషయంలో వరుస ట్వీట్స్ చేస్తున్నారు కత్తి మహేష్. అయన తాజాగా కామినేని శ్రీనివాస్ రాజీనామాపై సంచలన ట్వీట్ చేశారు. శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నిన్న ఓ ట్వీట్‌లో తన దృష్టిలో ఈ నలుగురే నిజమైన హీరోలంటూ పేర్కొని సంచలనం సృష్టించారు. సంపూర్ణేష్ బాబు, నిఖిల్ నిజమైన హీరోలు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకూ స్పందించిన శివాజీ, పవన్ కల్యాణ్ మినహా మిగతా ఏ హీరో కూడా నిజ జీవితంలో ప్రజల కోసం కనీసం మాట, ఒక ట్వీట్, ఒక ఉద్యమ అడుగు వెయ్యలేదు. కాబట్టి ప్రస్తుతానికి నా దృష్టిలో ఈ నలుగురే హీరోలు అంటూ ట్వీట్ చేశారు.