//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

# మీటు ని దుర్వినియోగం చేసిన నటి

Category : movies

మీటు ప్రతీ ఇండస్ట్రీ లో సంచలనం రేపుతున్న హాట్ టాపిక్. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ , సౌత్ వరకు పాకిన ఈ మీటు నానా పాటేకర్ పై చేసిన ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. తమిళంలో సింగర్ చిన్మయి , కన్నడం లో శృతి హరిహరన్ అర్జున్ పై చేసిన ఆరోపణలు ఇలా... చాలా మంది బాధితులు మీటు ఉద్యమంలో పాల్గొంటున్నారు.

అయితే సినీ పెద్దలు మీటు ఉద్యమాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయ్... కానీ అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కానీ అనుకున్నట్టు మీటు ని దుర్వినియోగం చేసింది బాలీవుడ్ నటి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నటి, మోడల్ కేట్ శర్మ ఆరోపణలు చేసింది. తనను ఇంటికి పిలిచిన సుభాష్ ఘయ్ అక్కడ చాలామంది ఉండగానే మసాజ్ చేయమని అడిగారని పేర్కొంది. తాను కాదనలేక రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్తే ఆయన తన వెనకాలే వచ్చారని తెలిపింది.

తనను పట్టుకుని తనతో ఒకరాత్రి గడిపితే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని చెబుతూ తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేట్ శర్మ ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. నటి ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, సుభాష్ ఘయ్‌పై ఆమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చారు.

అంతేకాదు, ఆరోపణల్లో పసలేదని తేలిపోవడంతో తన తల్లి ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో దర్శకుడిపై పెట్టిన కేసును ఆమె వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా, సుభాష్ ఘయ్ స్పందిస్తూ తనపై లేనిపోని ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠను బజారుకు ఈడ్చేందుకు ప్రయత్నించిన కేట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Related News