//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విషమించిన కరుణానిధి ఆరోగ్యం ...!

Category : state

తమిళనాడు సీఎం పళనిస్వామిని డీఎంకే నేత స్టాలిన్ కొద్ది సేపటి క్రితం కలిశారు. డీఎంకే అధినేత, తన తండ్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి పళనిస్వామికి స్టాలిన్ వివరించినట్టు సమాచారం.

కాగా, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉంది. కరుణ ఆరోగ్యం పై హెల్త్ బులెటిన్ కొంచెం సేపట్లో విడుదల కానుంది. ఇదిలా ఉండగా, కావేరి ఆసుపత్రి వద్దకు కరుణానిధి అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధికి సంఖ్యలో చేరుకున్నారు.

ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పోలీస్ అధికారులందరూ చెన్నైకి రావాల్సిందిగా చెన్నై డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో ఉన్న డీఎంకే పార్లమెంట్ ఎంపీలు, కీలక నేతలను చెన్నైకి రావాల్సిందిగా
అన్నా అరివాలయం ఆదేశాలు పంపింది.

Related News