//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కరుణానిధి రాజకీయ ప్రస్థానం......పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో గెలిచిన ఒకే ఒక్కడు....!

Category : state politics

కరుణానిధి రాజకీయం లో అలుపెరగని బాటసారిలాగా, చివరికి తన తుదిశ్వాస విడిచే వరకు తమిళ ప్రజానీకం శ్రేయస్సుకోసం పరితపిస్తూ,సుపరిపాలన అందిస్తూ సాగాడు. అరవై ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి అనేది లేదు. మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1969లో అన్నాదురై మరణం తరువాత పార్టీ వ్యవస్థాపకులల్లో ఒకడైన కరుణ పేరే అందరి నోటా వినిపించింది. అప్పుడు చేపట్టిన పార్టీ పగ్గాలు ఇప్పటికీ ఆయన చేతిలోనే ఉన్నాయి. 1969లో డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మరణించిన అనంతరం జరిగిన వారసత్వ పోరులో కలైంజర్‌ పైచేయి సాధించి అటు.. సీఎంగా, ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 50 ఏళ్ల పాటు నిరాటంకంగా అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగారు.

తమిళనాడు సీఎంగా జయలలిత ఆరుసార్లు ప్రమాణస్వీకారం చేయగా.. కరుణ ఐదుసార్లు చేసారు కానీ.. రోజుల లెక్క చూస్తే ఎక్కువకాలం ఆ సీఎం కుర్చీ పై ఉన్నది కరుణానిధే. జయలలిత 5,239 రోజులు, కరుణానిధి 6,809 రోజులు(18 ఏళ్ల 6 నెలలు) సీఎం పదవిలో ఉన్నారు. తమిళనాడుకు మూడో ముఖ్యమంత్రి కరుణానిధి.

1957 నుంచి 2016 వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తమిళనాడు చరిత్రలో ఇన్నిమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వారు మరొకరు లేరు. ఒకసారి శాసనమండలికి ఎంపికయ్యారు. 1991లో జయ ప్రభంజనంలోనూ ఆయన జయకేతనం ఎగురవేశారు. డీఎంకే నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. అయితే జయలలిత అప్పటికే శపథం చేసి మరీ సీఎంగా అసెంబ్లీకి వస్తుండడం, సభలో తన పార్టీ సభ్యులు లేకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలోని తమిళుల హక్కుల కోసం 1983లోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.