//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ....కోర్టు తీర్పు మరికాసేపట్లో....!

Category : state politics

తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేస్తూన్న సమయంలో మరణించిన వారికి మాత్రమే మెరీనా బీచ్ లో స్థలాన్ని కేటాయించారని, మాజీ సీఎంలు మరణిస్తే, మెరీనా బీచ్ లో అంత్యక్రియలను గతంలో ఎన్నడూ జరపలేదని ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో తన తుది వాదనను వినిపించింది.

అక్కడే అంత్యక్రియలు చేయాలని ధర్మాసనం భావిస్తే, అంగీకరిస్తామని, ఆ తరువాత ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నిందించవద్దని పేర్కొంది.పలు పర్యావరణ అంశాలు, తీర ప్రాంత నిబంధనలు ముడిపడివున్న ఈ విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమేనని చెప్పింది.

కామరాజ్ నాడార్ మరణించిన సమయంలో డీఎంకే అధికారంలో ఉందని, అప్పట్లో ఆయన అంతిమ సంస్కారాలను మెరీనా బీచ్ లో చేయలేదని తెలిపింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు అధికారంలో ఉండి కన్నుమూసినందునే స్థలం కేటాయించామని వాదించింది. ఈ కేసులో కోర్టు తీర్పు మరికాసేపట్లో వెల్లడి కానుంది.