//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లండన్ కు పారిపోయిన కీర్తి చిదంబరం

Category : national


ఇప్పటికే భారతీయ కోర్టుల నుండి తప్పించుకొంటూ ఇంగ్లాండ్ లో ఇద్దరు ప్రముఖులు - లలిత్ మోడీ, విజయ్ మాల్యా ఆశ్రయం పొందుతున్న సమయంలో సీబీఐ విచారణలో చిక్కుకున్న మరో ప్రముఖుడు ఇప్పుడు  అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. 

తన ఇంటిపై, ఆఫీస్ పై దాడులు జరిపిన రెండు రోజులకే మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం కుమారుడు గురువారం లండన్ కు పారిపోయిన్నట్లు తెలుస్తున్నది. మరో స్నేహితుడితో కలసి చెన్నై నుండే ఓకే ఆంతర్జాతీయ ఎయిర్ లైన్స్ విమానంలో జారుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు సీబీఐకి కి తెలిపాయి. 

తండ్రి కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇప్పించడంలో `ముడుపులు' తీసుకొన్నట్లు కీర్తి పై నిర్దుష్టమైన ఆరోపణలతో సోమవారమే సిబిఐ యప్ ఐ ఆర్ నమోదు చేసింది. మొత్తం అటువంటి 20 కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. త్వరలోనే  ప్రశ్నించడానికి పిలవచ్చని లేదా అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్న సమయంలో దేశం వదిలి వెళ్లిపోవడం సిబిఐ వర్గాలకు విస్మయం కలుగుతున్నది.

 సిబిఐ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా కీర్తి ఆరోపించారు. ఇప్పటికే లలిత్ మోడీ, విజయ్ మాల్యా లను భారత్ కు రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కీర్తి చిదంబరం కూడా అక్కడికే చేరుకోవడంతో దర్యాప్తు సంస్థలు షాక్ కు గురయ్యాయి.