//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కర్ణాటక జైళ్ల డీఐజీ రూప బదిలీ !

Category : national

జైలులో ఉన్న శశికళ నుండి రూ 2 కోట్ల ముడుపులు తీసుకొని ఆమెకు ఉన్నతాధికారులు జైల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నారని అంటూ డిజిపి, హోమ్ కార్యదర్శులకు నివేదిక పంపిన కర్ణాటక జైళ్ల శాఖ  డీఐజీ రూప మౌద్గిల్ ను కర్ణాటక ప్రభుత్వం  అర్ధాంతరంగా బదిలీ చేసింది. 

ఆమెను ఇప్పుడు ట్రాఫిక్ విభాగానికి పోస్ట్ చేశారు. కాగా ఆమె అవినీతి ఆరోపణలు చేసిన జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణరావును కూడా బదిలీ చేశారు. తాను లంచం తీసుకోలేద‌ని, కోర్టు ఆదేశాల మేరకే శశికళపై సహకరిస్తున్నానని స‌త్య‌నారాయ‌ణరావు పేర్కొనడం  తెలిసిందే. 

రూప శశికళపై ప్రత్యేక వంటగది ఏర్పాటు చేయడంతో పాటు విఐపి సదుపాయాలు కలుగచేస్తున్నారని మాత్రమే కాకుండా జైలు లో జరుగుతున్న పలు అక్రమాలను కూడా ఆమె ప్రస్తావించారు. వైద్య సిబ్బంది ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, స్టాంప్ పేపర్ల కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీం కు తోటి ఖైదీలతో శరీర మర్దన చూపిస్తున్నారని కూడా ఆమె పేర్కొన్నారు. 

ఆమె పంపిన నివేదికపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన ముఖ్యమంత్రి సుద్ద రామయ్య, నెలరోజుల లోపు నివేదిక ఇవ్వమని ఆదేశించారు. అవినీతిపై ఆరోపణలు చేయడం మంచిదే గాని ముందుగా పత్రికలవారికి తెలపవద్దని రూపా ను ముఖ్యమంత్రి మందలించారు. 

రూప బదిలీ పట్ల జెడి (యస్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యచ్ డి కుమారస్వామి విస్మయం వ్యక్తం చేశారు. జైలులో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుపుతున్నవారికి మద్దతు ఇచ్చిన్నట్లు అయినదని విమర్శించారు.