//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రజని కాంత్ కి గట్టి షాక్

Category : national movies

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి కావేరి నది జలాల దెబ్బ గట్టిగానే తగిలింది. ఆయన నటించిన ‘కాలా’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసే అవకాశం కనపడటం లేదు. దీనితో రజిని కాంత అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల చేయించేలా అవకాశం కల్పించాలని రజనీకాంత్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు సదానందస్వామి, రజనీ సంతోష్ లు కోరారు. వారు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు సారా గోవింద్‌కు వినతి పత్రాన్ని అం దించారు. దీనికి ప్రధాన కారణం కావేరీ జలాల విషయంలో రజనీకాంత్‌ తమిళనాడుకు అనుకూలంగా మాట్లాడడం అక్కడి ప్రజలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు.

కావేరీ జలాల విషయంలో కన్నడ సినిమా రంగం పోరాటానికి మద్దతునిస్తోంది. కర్ణాటకలో పుట్టి ప్రవహించే నదీజలాల విషయంలో రజనీకాంత్‌ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో చలనచిత్ర వాణిజ్య మండలి కాలా సినిమా విడుదలకు అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు రజనీకాంత్‌ అభిమాన సంఘం వాణిజ్యమండలి అధ్యక్షులతో చర్చలు జరిపారు. ప్రపంచ వ్యా ప్తంగా విడుదలయ్యే సినిమాను కేవలం కర్ణాటకలో వ్యతిరేకించడం సరికాదని అతన్ని నటుడిగా మాత్ర మే చూడాలని కోరారు. సౌత్‌ ఇండియా ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చెన్నైకు లేఖ పంపినట్లు సదానందస్వామి మీడియాకు తెలిపారు. వాస్తవానికి రజిని సొంత రాష్ట్రం కర్ణాటక.. అయినా ఆయనకు అక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుంది.