//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కన్నడనాట టికెట్ రచ్చ..బిజెపిలో

Category : politics

త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో విజయం కొస౦ బిజెపి నానా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా నటులను క్రికెటర్లను కూడా ఆ పార్టీ ప్రచారం చెయ్యాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె తాజాగా ఆ పార్టీ తొలి అభ్యర్ధుల జాబితాను ప్రకటించగా అక్కడ అది రచ్చగా మారినట్టు తెలుస్తుంది. చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున టికెట్‌ పొందిన..

ఎంపీ బి. శ్రీరాములుకు నాయకనహట్టి ప్రాంతంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.మొళకాల్మూరు ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయులు(బీజేపీ) శ్రీరాములుపై చెప్పులు, చీపుళ్లు, రాళ్లతో దాడికి దిగారు. అలాగే చాలా మంది ఆశావాహులకు బిజెపి సీట్లు ఇవ్వలేదు. ఇదిలా ఉంటె సిద్దరామయ్య బిజెపిని దెబ్బకొట్టడానికి మరో వ్యూహం సిద్దం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న..

వరుణ నియోజకవర్గానికి బదులుగా మరో స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిద్దరామయ్య వచ్చే ఎన్నికల్లో బాగల్‌కోట్‌ జిల్లాలోని బాదామి నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అలాగే ఇప్పుడు మళ్లీ పాత నియోజకవర్గం చాముండేశ్వరి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనితో ఆయన బిజెపికి పట్టున్న ప్రాంతాల్లో దృష్టి సారించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి...

Related News