//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క‌ర్నాట‌క సీయం కుర్చి ఎవ‌రిది.. తేల్చేసిన గ‌వ‌ర్న‌ర్..?

Category : politics

దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన కర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. అనేక ఊహ‌లు, క‌థ‌నాల‌ను ఉటంకిస్తూ.. తీవ్ర ఉత్కంఠ‌కు గురి చేసిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు చివ‌రికి హంగ్ దిశ‌గానే నిలిచాయి. దీంతో క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వ ఏర్పాటు అంశం.. ఇప్పుడు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విజుభాయ్ కోర్టుకు చేరింది. ఆయ‌న నిర్ణ‌యం పైనే ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యేది. వాస్త‌వానికి బీజేపీ అదికారంలోకి వ‌చ్చేందుకు కేవ‌లం 10 స్థానాలు మాత్ర‌మే కావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి 104 స్థానాల్లో ఆధిక్యం ల‌భించింది. అయితే మేజిక్ ఫిగ‌ర్ మాత్రం 113 కావ‌డంతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన ఎమ్మెల్యేలు ల‌భించ‌లేదు. ఇక‌, కాంగ్రెస్ కూడా ఇదే త‌ర‌హాలో అధికారానికి చేరువ కాకుండా ఆగిపోయింది. ప్రాంతీయ పార్టీ జేడీఎస్ 39 స్థానాలు గెలిచి నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఎదిగింది.

దీంతో కర్ణాటక రాజకీయం రాజ్ భవన్ కు మారింది. కేంద్రమంత్రి అనంతకుమార్, బీజేపీ నేత యడ్యూరప్ప కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు ఏడు రోజులు సమయాన్ని గవర్నర్ ఇచ్చారని యడ్యూరప్ప తెలిపారు. తాము కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించామని, తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమనే ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. దీంతో గవర్నర్ వాజూభాయి ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఇక మరికాసేపట్లో జేడీఎస్ నేత కుమారస్వామి కూడా గవర్నర్ ను కలవబోతున్నారు. తమ కూటమికి అవసరమైన మెజారిటీ ఉందని గవర్నర్‌కు ఆయన వినతి పత్రం అందించనున్నారు. అయితే, ఇప్పుడు మేజిక్ ఫిగ‌ర్ క‌న్నా కూడా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి స్థానాలు 117 కావడంతో గవర్నర్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వీరినే ప్ర‌భుత్వ ఏర్పాటుకు పిల‌వాల్సి ఉంటుంది. అయితే, ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల్లో గ‌తంలో జ‌రిగిన విధంగా.. త‌మ‌కు న‌చ్చిన పార్టీ మెజారిటీ కూడ‌గ‌ట్టుకునే వ‌ర‌కు ఆగితే.. ఇక్క‌డ కూడా ప‌రిస్థితులు వివాదాస్ప‌ద‌మ‌య్యే అవ‌కాశం ఉంది. తాము పెద్ద పార్టీగా ఏర్పడిన పక్షంలో.. ఒకవేళ గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రకటన చేస్తే ఏమిట‌నే ప్రశ్న ఉత్పన్నమ‌వుతోంది.

Related News