//single page style gallary page

Kargil Vijay Diwas symbolizes India's victory over Pak

Category : history

Click here to read this article in Telugu

కార్గిల్ విజయ్ దివస్ పాక్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తు..

దేశవ్యాప్తం గా సంబరాలు జరుపుకోవాల్సిన రోజు ఇది. 'ఆపరేషన్ విజయ్'లో పాలుపంచుకుని ప్రాణాలు అర్పించిన కార్గిల్ అమరవీరులను యావత్ జాతి మరోమారు స్మరించుకోనుంది. దేశ వ్యాప్తంగా 20వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను శుక్రవారం(జులై 26) ఉదయం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ కార్గిల్ జిల్లాలో ద్రాస్‌లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పాల్గొననున్నారు. కార్గిల్ విజయ జ్యోతి ర్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ద్రాస్‌కు చేరుకోనుంది.

ఢిల్లీలో జరిగిన వేడుకలో ఈ విజయ జ్యోతిని సుబేదార్ జితు రాయ్‌కి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అందజేశారు.ఇక యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు అప్పటి నుంచి ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ రోజున నివాళులర్పిస్తున్నారు. కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలని ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు చేపట్టిన దుశ్చర్యను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. యుద్ధంలో భాగంగా పాక్ ఆక్రమించుకున్న ఎన్నో ప్రాంతాలను భారత్ మళ్లీ స్వాధీనం చేసుకుంది. కార్గిల్ యుద్ధంలో పాక్‌పై భారత్‌ సాధించిన విజయానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్‌గా మనం జరుపుకుంటున్నాం..!

It is a day to be celebrated nationwide. The Kargil martyrs who took part in ' Operation Vijay ' will commemorate the death of the entire nation. The 20th Cargill Vijay Diwas celebrations will be held on Friday (July 26). Arrangements are being made to hold the Kargil Vijay Diwas ceremony in Dras in Jammu and Kashmir's Kargil district. President Ramnath Kovind will attend the function . The Kargil Vijay Jyoti Rally is expected to reach Dras from the national capital of New Delhi .

Defense Minister Rajnath Singh presented the victory message to Subedar Jitu Roy at a ceremony in Delhi. India has effectively confronted the heinousness of Pakistani soldiers with terrorists seeking to invade Kashmir . India recaptured many of the areas occupied by Pakistan as part of the war. We celebrate Kargil Vijay Diwas on July 26 every year to commemorate India's victory over Pakistan in the Kargil War !