//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్, పవన్ కలిశారు పొత్తులపై చర్చ చేశారు..కారెం శివాజీ షాకింగ్ కామెంట్

Category : politics

ప్రతిపక్ష నేత jagan, జనసేనాని Pawan కలిశారు. సీట్ల సర్ధుబాటు పై చర్చలు జరిపారు. కానీ ఇద్దరికీ సీఎం సీటు మీద కన్ను వారి చర్చలను విఫలం చేసింది. వాళ్ళ పొత్తు పొడవలేదు అని షాకింగ్ కామెంట్ చేశారు ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ.

ఇటీవలే విశాఖపట్టణంలోని వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిసారని వెల్లడించిన ఆయన వారి మధ్య జరిగిన చర్చ ను కూడా చెప్పి ఎన్ని చేసినా అధికారంలోకి రాలేరని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాట్లాడిన karem sivaji వట్టి రవి ఇంట్లో కలిసిన జగన్, పవన్ మధ్య పొత్తు గురించి ,సీట్ల సంఖ్య గురించి కీలక చర్చలు జరిగాయన్నారు. అయితే ఈ చర్చల్లో సీట్ల సర్ధుబాటు కాకపోవడంతో వీరి మధ్య పొత్తు ఖరారు కాలేదని కారెం శివాజీ చెప్పుకొచ్చారు.

జగన్ పాదయాత్ర సమయంలో వట్టి రవి నివాసంలో పవన్‌ను జగన్ కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారని చెప్పారు. అయితే సీఎం కావాలని చూస్తున్న Pawan అందుకు ఒప్పుకోలేదు. అంతకంటే సీట్లు ఇచ్చేందుకు జగన్ సైతం ఒప్పుకోలేదు . అలా ఆ చర్చల్లో సీట్లు సర్దుబాటు కాక వీరి పొత్తు పొడవలేదు...అని కారెం శివాజీ వెల్లడించారు. అయితే కుల, మత రా జకీయలు చేసే నాయకులు Jagan, Pawan లు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని చెప్పారు కారెం శివాజీ .

వీరిద్దరూ ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఆడేవాళ్ళన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఏపీని మోసం చేసిందని చెప్పిన ఆయన అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం వల్లే రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు Congressపార్టీతో కలిసి ప్రయాణం సాగిస్తున్నారని చెప్పారు. ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ముందుకొచ్చారని శివాజీ వివరించారు. ఈ నేపధ్యంలో పైకి తిట్టుకున్నా లోపల పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని చెప్పి సంచలనానికి తెరతీశారు.

Related News