//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నా ధ్యాసంతా సినిమాలపైనే అంటున్న కరీనా .. మరి ఎంపీ గా పోటీ ?

Category : national politics

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రాజకీయాల్లోకి రానున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగనున్నారా? భోపాల్ నుండి ఆమె పోటీ ఖరారైందా? అంటే నాకే తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అంటున్నారు కరీనాకపూర్.బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కరీనా కపూర్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తనకు అలాంటి ఉద్దేశమే లేదని నటి కరీనా కపూర్ స్పష్టం చేసింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో ఆమె నిలవనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు వచ్చిన వదంతులను నటి కరీనా కపూర్ కొట్టిపారేసింది. ఏ పార్టీవారు కూడా తనతో సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన ధ్యాసంతా సినిమాలపేనే ఉందని చెప్పింది. కరీనా, సైఫ్ దంపతులకు తైమూర్ అనే బాబు సంతానం. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ, మరోవైపు అత్తింటివారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యతలు నిర్వర్తిస్తోంది కరీనా. గతంలో బాలీవుడ్‌ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ కూడా లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్నారని ప్రచారం జరగగా.. అందులో నిజం లేదని ఆమె స్పష్టం చేయడం తెలిసిందే. కాగా, మధ్యప్రదేశ్‌లో 15ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది.

భోపాల్ స్థానాన్ని కాంగ్రెస్ గెలవాంటే కరీనాకు సీటు కేటాయించాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ యోగేంద్ర సింగ్ చౌహాన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయడంతో ఈ దుమారం మొదలైంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కరీనా మామ సైఫ్ అలీఖాన్ తండ్రి, మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే కరీనా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుందన్న దుమారం రేగినట్లు గా భావిస్తున్నారు.

Related News