//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేజ్రీవాల్ పై 'ఆవినీతీ' ఆయుధం !

Category : national editorial

అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఉధృతంగా తెరపైకి వచ్చి, అనూహ్య రీతిలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, ప్రజాకర్షణలో తిరుగులేని ప్రధాని నరేంద్ర మోడీ ని ఢీ కొట్టే ప్రయత్నం చేస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై `అవినీతి' అస్త్రంగా ఇప్పుడు దాడి మొదలైనది. మొన్నటి వరకు ఆయన మంత్రివర్గంలో ఉన్న కపిల్ మిశ్ర తనను మంత్రివర్గం నుండి తొలగించిన కొద్దీ గంటలకే తన సమక్షంలో మరో మంత్రి నుండి రూ 2 కోట్లు కేజ్రీవాల్ తీసుకోవడం చూశానని చెప్పడం ద్వారా సంచలనం సృష్టించారు.

ఆప్ లో పలువురు సహచరులపై ఇంతకు ముందు తీవ్ర ఆరోపణలు వచ్చినా నిజాయతి పరుడిగా ప్రజల దృష్టిలో గుర్తింపు పొందుతున్న కేజ్రీవాల్ పై ఈ ఆరోపణను సంధించడం పట్ల రాజకీయ వర్గాలలో పెను సంచలనం కలిగిస్తున్నది. మొన్నటి వరకు మంత్రి పదవిలో ఉన్నప్పుడు పెదవి విప్పని వ్యక్తి, ఇప్పడు పదవి పోగానే చేస్తున్న ఆరోపణల స్థాయి గురించి ఎవ్వరూ ప్రశ్నించక పోవడం గమనార్హం.

పదవులు కోల్పోయిన నాయకులు నాయకత్వంపై ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉండటం సాధారణమే మిశ్ర ఆరోపణలు చేసిన వెంటనే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాలి అంటూ బిజెపి, కాంగ్రెస్ నాయకులు చేయడం గమనార్హం. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో అప్ ఘోర పరాజయం పొందినా అవినీతి వ్యతిరేక రాజకీయ వేత్తగా కేజ్రీవాల్ ప్రాధాన్యత తగ్గించడం కోసం ఈ ఆరోపణలు ఇతర పక్షాలకు ఆయుధంగా లభించినట్లు అయింది.