//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రజనీ కాంత్ ముఖ్యమంత్రి కాలేడట, ఎందుకంటే ?

Category : national

రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంచలన ప్రకటన చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఇప్పుడు టాక్ అఫ్ ఇండియా గా మారాడు.

అలా రాజకీయల్లోకి వస్తున్నానని ప్రకటించాడో లేదో తమిళ, తెలుగు, బాలీవుడ్ ఇండస్ట్రీల నుండి ఆయనకీ మద్దతు పెరుగుతూ వస్తోంది. అయితే ఇటువంటి సమయాన కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రకాష్‌ అమ్మునై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రజనీ జాతకాన్ని పరిశీలించిన ప్రకాష్‌.. పలు కీలక, రజనీకి ఆయన అభిమానులకి మింగుడు పడని అంశాలని బయట పెట్టాడు.

తలైవాకి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని పాలించే యోగం లేదట. ఎప్పటికి రజనీకాంత్ ‘కింగ్ మేకర్’గా ఉంటారు తప్పితే, ‘కింగ్’ అయ్యే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. అందుకు కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఆయన జ్యోతిష్యం ప్రకారం రజనీకాంత్ మకరరాశిలో, సింహలగ్నంలో జన్మించారని అందుకే ‘తలైవా’ను ఓడించడం ప్రత్యర్థులకు సాధ్యం కాదన్నారు.

అయితే సన్నిహితుల కారణంగా ఆయనకు చెడు జరిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి సన్నిహితులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆయన ముఖ్యమంత్రిని కావాలన్న ఆలోచనను మానుకుని మరొకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడమే మేలని సూచించారు ప్రకాష్‌ అమ్మునై. ఈ విషయాన్ని ప్రకాష్‌ ఓ జాతీయ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.