Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు సైంధవుడిలా మారిపోయారు

Category : state politics

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసారు, చంద్రబాబు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాజాగా మాట్లాడిన ఆయన రాష్ట్రానికి చంద్రబాబు సైంధవుడిలా మారారని, సంస్కారహీనులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందని, టీడీపీకి రాజకీయం తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి నిధుల బకాయిలు లేవని, రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో జాప్యం జరుగుతోందని కన్నా విరుచుపడ్డారు. ఈ నెల 24న పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నామని, ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా తీసుకుంటామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.