Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలీవుడ్ క్వీన్ చేతిలో బలై పోతున్న హృతిక్ ఆ అమ్మడు దెబ్బకు తన సినిమానే వాయిదా వేసుకున్నాడు పాపం.?

Category : movies

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ అమ్మడు సినిమాల్లో ఎంత బాగా నటిస్తుందో..... రియల్ లైఫ్ లోనూ అంతే బాగా జీవిస్తుంది. సమయం, సందర్భం అని తేడా లేకుండా..... తనకేమనిపిస్తే అది చేయడం. ఎంతటి వారినైనా ఇట్టే తన మాటలతో నిప్పించడం ఈ అమ్మడుకి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. సినిమా ప్రమోషన్స్ కి మించిన వివాదాలతో ఎప్పటికప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ అమ్మడు.తన మాటల దాడితో స్టార్ హీరోలను కూడా వదిలి పెట్టకుండా ఒక ఆట ఆడుకుంటుందో.... ఇప్పటికే పలు వేదికలపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై పలు రకాల విమర్శలతో ఇరకాటం లో పెట్టిన కంగనా రనౌత్.....తాజాగా మరో మారు తన మాటలతో టార్చర్ పెట్టింది....ఇన్నాళ్లు మాటలకే పరిమితం అయిన కంగనా ఇప్పుడు ప్రొఫెషనల్ గానూ అవాంచిత యుద్ధమే ప్రకటించింది.అసలు వివరాల్లోకి వెళితే.... ఇటీవలే హృతిక్ రోషన్ నటించిన "సూపర్ 30" మూవీ రిలీజ్ తేదీని.... ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 26 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.సరిగ్గా అదే సమయంలో కంగన నటించిన మెంటల్ హై క్యా చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నామని ఏక్తా కపూర్ ప్రకటించడం మరో సంచలనమైంది.

ఆ క్రమంలోనే కంగనా రనౌత్ అసలు గేమ్ స్టార్ట్ చేసింది. హృతిక్ ని టీజ్ చేస్తూ మా సినిమా రిలీజవుతోంది....అంటూ గొప్పలకు పోతుంది.హృతిక్ తన సినిమాని వాయిదా వేసుకోవడం గ్యారెంటీ అంటూ ఆట పట్టించింది. ఆ వ్యాఖ్యలను అంతే సీరియస్ గా తీసుకున్న హృతిక్ ఈ మెంటల్ టార్చర్ ని భరించలేను అంటూ ఓ పెద్ద ట్వీట్ నే చేశాడు ....ఈ లెక్కన తాను మీడియాకి ఆహారంగా మారుతున్నాను.ఎందుకీ పిచ్చి గోల.....!! అంటూ సూపర్ 30 సినిమాకి కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం మరో సంచలనమైంది. కంగన వల్ల తాను ఎంత మనోవేదన అనుభవిస్తున్నది హృతిక్ ఒక సుదీర్ఘ మైన నోట్ ద్వారా వ్యక్తం చేసిన తీరు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విషపూరిత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా....! నన్ను నేను కాపాడుకునేందుకు రిలీజ్ తేదీని మార్చమని నిర్మాతల్ని అభ్యర్థిస్తున్నా.. అంటూ హృతిక్ ఎంతో మనోవేదనను కనబరచడం ఆయన అభిమానులని ఎంతో కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ విషయం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.