//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయాల్లో కలకలం రేపుతున్న కమల్ నిర్ణయం

Category : movies

లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా బిజీ లో ఉన్నాడు. భారతీయుడికి సీక్వెల్ గా రానున్న ఈ కథ కమల్ రాజకీయ జీవితానికి బూస్ట్ ఇచ్చేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. కమల్ సినిమాలో అవకాశం లభించినందుకు కాజల్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. కమల్‌తో తొలిసారి నటిస్తుందన్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.

కమల్ హాసన్ సినిమాలకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఓపెనింగ్స్ ఇస్తూనే ఉంటారు. విశ్వరూపం 2 డిజాస్టర్ అయినా ఫస్ట్ డే మాత్రం మంచి కలెక్షన్ రాబట్టుకుంది. ప్రస్తుతం ఇండియన్ 2 కోసం శంకర్ తో పని చేయడానికి రెడీ అయిన కమల్ నటుడిగా ఇదే తన చివరి సినిమా అని ప్రకటించడం అభిమానుల్లో ఇప్పటికే కలకలం రేపింది. పూర్తి స్థాయి రాజకీయాల్లో కి ఫోకస్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తనను వ్యక్తిగతంగా కలిసిన అభిమానులతో నేరుగా చెప్పేసిన కమల్ ఇండియన్ 2 ఓపెనింగ్ రోజు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించబోతున్నారు.దీంతో కమల్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండియా 2 ఆఖరి చిత్రం అయితే మరి శబాష్ నాయుడు చిత్రం వస్తదో లేదో అన్న ఆందోళనలో కూడా అభిమానులు ఉన్నారట.

దశావతారంలోని సిబిఐ ఆఫీసర్ శెట్టి పాత్రను స్ఫూర్తి గా తీసుకుని రూపొందించిన కథతో తయారైన ఈ మూవీకి దర్శకుడు కమల్ హాసనే షూటింగ్ కూడా సగానికి పైగా నే పూర్తి చేసుకుంది. శృతి హాసన్ మొదటి సారి నాన్నతో కలిసి నిజ జీవిత పాత్రలో నటించింది ఇందులోనే. కాని ఇది జరుగుతున్న సమయంలోనే కమల్ మెట్ల పై నుంచి కాలు జారి కింద పడి చాలా రోజులు బెడ్ రెస్ట్ కు అంకితం కావాల్సి వచ్చింది. అప్పుడు ఆపేసిన ఈ చిత్రం మళ్ళీ మొదలుపెట్టలేదు. కమల్ కూడా దాని మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదంట. మరి ఇండియన్ సినిమా ఆఖరి చిత్రం అయితే ఈలోపు శభాష్ నాయుడు వస్తాదని అభిమానులు ఆశపడుతున్నారు.

Related News