//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెట్స్ మీద‌కు కమలహాసన్ భారతీయుడు-2 (ఇండియ‌న్‌2 )

Category : movies

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ తండ్రీకొడుకులుగా రెండు పాత్ర‌ల్లో న‌టించిన సినిమా భారతీయుడు. అప్ప‌ట్లో ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. విభిన్న పాత్రలలో నటించే కమల్ హాసన్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయ‌నున్న‌ట్టు గ‌త కొంత‌కాలంగా ప్ర‌క‌ట‌న‌లు వెలువడుతూనే ఉన్నాయి. తెలుగు నిర్మాత దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్ ను చేయడానికి ముందుకు వచ్చి ,ఆ తర్వాత ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. ఇటీవ‌ల ఈ సినిమాను మ‌నం చేయ‌డం లేదు అని ప్రెస్ ముందు బాహాటంగానే చెప్పారు.

ఇప్పుడు `ఇండియ‌న్‌2`కి సంబంధించి స్క్రిప్ట్ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయ‌ని, మూడు గంట‌ల పాటు శంక‌ర్ క‌థ‌ను నెరేట్ చేశార‌ట‌. ఈ సినిమా సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని, ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా క‌మ‌ల్ కాస్త వెయిట్ లాస్ అవుతున్నార‌ని, ఈ చిత్రానికి కెమెరామేన్‌గా ప‌నిచేయ‌బోయే ర‌వి వ‌ర్మన్ వెల్ల‌డించారు. త‌న ఎదుగుద‌ల‌కు క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అన్నారు.

శంక‌ర్ ప్ర‌స్తుతం రోబో2 ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇంత బిజీలోనూ ఇండియ‌న్‌2 సినిమా క‌థ‌ను శంక‌ర్ ఎలా రెడీ చేయ‌గ‌లిగార‌ని అంద‌రూ ఆచ్చర్యపోతున్నారు. 2019లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల లోపు ఈ సినిమాను పూర్తిచేయాలని, లేకుంటే క‌మ‌ల్ రాజ‌కీయాల‌తో బిజీ అయితే ఈ ప్రాజెక్ట్ మ‌రింత డిలే అయ్యే అవకాశం ఉందని శంక‌ర్ అన్నివిధాలా తొంద‌ర‌ప‌డుతున్నార‌న్న‌ది కోలీవుడ్ న్