//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. నా నువ్వే జెన్యూన్‌ ప‌బ్లిక్ టాక్.. ఇంతకీ ఫైన‌ల్ టాక్ ఏంటి..?

Category : movies

టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ అంటేనే మాస్‌కు పండ‌గ‌. నంద‌మూరి ఫ్యామిలీ నుండి ఓ సినిమా వ‌స్తోందంటే.. మాస్ ప్రేక్ష‌కుల్లో విప‌రీతమైన అంచ‌నాలు ఉంటాయి. అదే దారిలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కూడా న‌డిచారు. వ‌రుస‌గా మాస్ చిత్రాల్లోనే ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు న‌టించారు. అయితే రెండు, మూడు హిట్లు త‌ప్పా క‌ళ్యాణ్‌కి పెద్ద‌గా క‌లిసిరాలేదు. దీంతో త‌న పంధాను మార్చి తొలిసారిగా నటించిన పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం నా నువ్వే. గ‌తంలో సిధ్ధార్ధ్‌తో 180 అనే చిత్రం తీసిన డైరెక్ట‌ర్ జ‌యేంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న‌ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌గా..ఈ గురువార‌మే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం టాక్ ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

చిత్ర ట్రైలర్స్ , ఆడియో చాల కొత్తగా ఉండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే అందరిలో నెలకొన్నాయి. మరి దానికి తగట్టు సినిమా ఉందా..లేదా బెనిఫిట్ షో చూసిన ప్రేక్ష‌క‌ల టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. అద్భుతంగా ఉందని.. సినిమా చాలా కూల్‌గా ఉందని.. తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు. జయేంద్ర‌ సినిమాను అద్భుత‌మైన ఫీల్‌తో తెరకెక్కించారని, పి.సి.శ్రీరామ్‌ ఎక్స్‌ట్రార్డినరీ విజువ‌ల్స్‌తో ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా చూపించారని దర్శకుడు చాలా హానెస్ట్‌‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడని స్క్రీన్ ప్లే చాలా బావుందని.. కాకపోతే సినిమా కాస్త స్లోగా ఉందని బెనిఫిట్ షో చూసిన ప్రేక్ష‌కులు తేల్చేశారు. మ‌రి ఈసారైనా నంద‌మూరి హీరోకి హిట్ వ‌స్తుందో లేదో తెలియాలంటే కొద్ద‌సేపు ఆగాల్సిందే.