//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క‌ళ్యాణ్ రామ్ నా నువ్వే.. మ‌హేష్ క‌త్తి నుండి నమ్మశఖ్యం కాని రివ్యూ..!

Category : movies

నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి క్లాసీ ప్రేమ కథతో తెరకెక్కిన సినిమా నా నువ్వే. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారికీ సరికొత్తగా కనిపంచింది. ఎందుకంటే ప్రేమికుడి కోసం ఎదురు చూసే ప్రేయసి కధే నా నువ్వే. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ తన లుక్ ని పూర్తిగా చేంజ్ చేసేసాడు. ఆ లుక్ తో కళ్యాణ్ రామ్ లవర్ బాయ్ లా కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేసాడు. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కి యంగ్ టైగర్ రావటం సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. జయేంద్ర దర్శకత్వంలో వస్తున్న నా నువ్వే సినిమాకి P.C. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు.

P.C. శ్రీరామ్ గీతాంజలి,శుభ సంకల్పం,ఖుషి వంటి సినిమాలకు పనిచేసారు... అటువంటి P.C. శ్రీరామ్ నా నువ్వే సినిమాకి పనిచేయటం సినిమాకి మేజ‌ర్ ప్లస్ అని కత్తి మహేష్ తన రివ్యూ లో చెప్పాడు. ఇటువంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదని, ఈ సినిమా చూసిన అభిమానులు కొన్ని రోజుల పాటు ప్రేమ భావనలతో సరికొత్త అనుభూతితో ఉంటారని చెప్పారు. ఎప్పుడూ మాస్, సేంట్ మెంట్ సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ఒక లవర్ బాయ్‌గా కన్పించటం సాహసమనే చెప్పాలి. ఈ సినిమా క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకొనే విధంగా ఉందని, సినిమాలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉందని, సినిమా కమిట్ అయ్యినప్పుడు కూడా కళ్యాణ్ రామ్ కూడా ఇంత బాగా చేస్తానని అనుకోకపోవచ్చు అని.. క‌త్తి అన్నారు. ఇక తమన్నా విషయానికి వస్తే ఆమె నటన,హావభావాలు అన్ని బాగున్నాయని... ముఖ్యంగా పాటలలో చాలా బాగుందని.. ఈ సినిమాలో తమన్నా గత సినిమాల కన్న చాలా విభిన్నంగా ఉందని క‌త్తి అన్నారు. సినిమాలో P.C. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే నా నువ్వే లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదని క‌త్తి తేల్చేశారు.