//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంపీ కవిత చమత్కారం ... పురుష దినోత్సవం జరుపుకునే రోజు వస్తుంది

Category : politics state

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పురుషులపై చమత్కార బాణం సంధించారు. మహిళలు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, మహిళలు సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో పురుషులు, తమ ప్రాధాన్యాన్ని తెలియజేసేలా పురుషుల దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయని కవిత చమత్కరించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని చిన్న, మధ్య, సూక్ష్మ తరహా ఔత్సాహిక పారిశ్రామికుల శిక్షణ కేంద్రంలో లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన జాతీయస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

ఆ సమావేశానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.హైదరాబాద్ లో జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మహిళ తానూ, తన కుటుంబం ఉన్నత స్దాయికి ఎదగాలని కలలు కంటారు..అయితే ఈ కల సాకారం కావడంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె అన్నారు. వీటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సింది మనమేనన్నారు. మహిళలు సంఘటితంగా ఉంటే, భవిష్యత్ లో పురుషులు పురుషుల దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయని చెప్పిన కవిత తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.