Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్

Category : movies

ప‌న్నెండేళ్ల కింద వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తనదైన అందం, అభినయం తో నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటూ టాప్ హీరోయిన్ గా ఉంటూ వస్తున్న ఈ భామ. 12 యేళ్ళుగా ఇండ‌స్ట్రీలో ఉంటూ వస్తున్న ఈ అమ్మడు ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న త‌ప్ప మ‌రో ధ్యాసే పెట్ట‌లేదు. వయసు పై బడుతున్న కొంది పెళ్లి అనే ఉసు లేకుండా చేతి నిండా సినిమాల‌తో తెగ బిజీగా కాలం గడిపేస్తూ వస్తుంది. ఇక తాజా కాజల్ కు మ‌రో ఆశ కూడా పుట్టింది. ఎక్క‌డ అయితే బాగా సంపాదించిందో అక్క‌డే పెట్టు బడి పెట్టాల‌ని ఫిక్సైపోయింది. అందుకే కాజల్ నిర్మాత అవ‌తారం ఎత్త‌బోతుంది . న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్న.... ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉంటూ వస్తున్న ఈ అమ్మడు సినిమా నిర్మాణం ఎలా చేయాలో బాగానే నేర్చేసుకుంది . అందుకే ఇప్పుడు తన సొమ్మును ఇక్కడే ఖర్చు చేసి బారి లాభాలు పొందాలని చూస్తుంది.

పైగా ఈ అమ్మ‌డు మంచి బిజినెస్ ఉమెన్ కూడా. ఇప్పటికే జ్యూవెల‌రీ ,షూస్ బిజినెస్ లలో అడుగు పెట్టిన కాజ‌ల్ . ఈ రెండు వ్యాపారాలను తన చెల్లి నిషా అగ‌ర్వాల్ కి అప్పగించింది. ఇక తాజాగా మొదలు పెట్టబోయే సినిమా నిర్మాణ రంగంలో మాత్రం కాజల్ తన అదృష్టాన్ని నమ్ముకొనుంది. దీపం వుండగానే ఇల్లు చక్క బెట్టుకోవలి అన్న సామెతను నిజం చేస్తూ....వయసులో వుండగానే అన్ని కోరికలు తీర్చుకోవాలని చూస్తుంది.KA వెంచర్ పేరుతో ఓ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ కూడా కాజల్ మొద‌లుపెడుతుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా కన్ఫర్మ్ చేసింది . సీత ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చందమామ.. తాను నిర్మాతగా మారనున్నట్లు చెప్పింది. ఇన్నాళ్లూ తనలోని నటిని మాత్రమే చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తనలో ఉన్న నిర్మాతను కూడా చూపిస్తానంటుంది.

గతేడాది నాని నిర్మాతగా మారి చేసిన సినిమా " అ.." ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో తన తొలి సినిమా ప్లాన్ చేస్తుంద‌ని టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వ‌ర‌లోనే ఆమె క్లారిటీ ఇవ్వనుంది. నిర్మాతగా తొలి సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు కానీ కచ్చితంగా మంచి కథ ఉన్న సినిమాలనే నిర్మిస్తానంటుంది. ప్ర‌స్తుతం క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాతో పాటు క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు- 2, శర్వానంద్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది కాజ‌ల్. మ‌రి హీరోయిన్‌గా సూప‌ర్ స్టార్ అయిన కాజ‌ల్.. నిర్మాత‌గా ఎలాంటి మార్క్ అందుకుంటుం దో చూడాలి.

Related News