//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ నటుడు ఆకస్మిక మృతి !

Category : movies

గత కొద్ది కాలంగా సినీ నటుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

మొన్న శ్రీ దేవి, నిన్న వంకాయల సత్యనారాయణ మృతి చెందగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 55 ఏళ్ళు. ఈరోజు ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

మోడలింగ్‌తో కెరియర్‌ ప్రారంభించిన నరేంద్ర బాలీవుడ్‌ స్టార్‌హీరోలతో సమానంగా పలు కీలక ప్రాత్రల్లో నటించారు. కేవలం సినిమాలలోనే కాక టెలివిజన్‌ నటుడుగా కూడా ఆయన ప్రఖ్యాతి గాంచారు. అలా 2002లో ఫంటూష్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

అనతరం హదర్‌, రాయీస్‌, మొహంజోదారో లాంటి సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ మూవీ ‘కాబిల్‌’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. కాగా సల్మాన్‌ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మూవీలో రేస్‌-3 ఆయన ఆఖరి చిత్రం. ఆయన తెలుగులో చత్రపతి సినిమా లో నటించారు. బాజీ రావు పాత్ర లో ఆయన విలన్ గా నటించారు.

ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా లో కూడా ఆయన పేరు వినిపించింది. అయితే ఆయన షూట్ లో పాల్గొన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News