//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నా కళాతపస్వి విశ్వనాథ్‌.

Category : national

వెండితెర కళాతపస్వి విశ్వనాథ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాథ్‌ మాట్లాడారు. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన విశ్వనాథ్‌. అవార్డును అందుకుంటున్న శుభతరుణంలో తన తల్లిదండ్రులకు, సర్వాంతర్యామి అయిన దేవుడికి ప్రణామం చేశారు. రాష్ట్రపతికి, మంత్రులకు, తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ ఒక్క నిమిషంలోనే తన ప్రసంగాన్ని ముగించారు.