//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

k viswanath movies : కే విశ్వనాధ్ సినిమాలు : k viswanath awards family hit songs photos;

Category : editorial

కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు.కళాతపస్వి,కె.విశ్వనాధ్ గా ఆయన సుపరిచితుడు.అయన ఫిబ్రవరి 19, 1930 లో జన్మించాడు.భార్య జయలక్ష్మి.అయన పిల్లలు పద్మావతి దేవి,కాశీనాధుని నాగేంద్రనాథ్,కాశీనాధుని రవీంద్రనాథ్.అయన ప్రతిభకు జాతీయ ప్రభుత్వం పద్మ శ్రీ తో సత్కరించింది.

ప్రసంసమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి విశ్వనాధ్.కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు.

యన స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.

చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడి గా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.

శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.

విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

జాతీయ చలనచిత్ర పురస్కారాలు:

1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం.

1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం - సప్తపది.

1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు సాగరసంగమం.

1986 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు - స్వాతిముత్యం.

1988 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు శృతిలయలు.

2004 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు స్వరాభిషేకం.

1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం.

పద్మశ్రీ పురస్కారం.

2016 : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు :

ఆత్మ గౌరవం

అల్లుడు పట్టిన భరతం

సిరి సిరి మువ్వ

సీతామాలక్ష్మి

శంకరాభరణం

సప్తపది

ఆపద్భాందవుడు

నేరము శిక్ష

శృతిలయలు

స్వాతికిరణం

స్వాతిముత్యం

స్వర్ణకమలం

అమ్మ మనసు

శుభలేఖ

శుభోదయం

శుభ సంకల్పం

సిరివెన్నెల

సాగరసంగమం

స్వయంకృషి

జననీ జన్మభూమి

చిన్నబ్బాయి

సూత్రధారులు

స్వరాభిషేకం

జీవిత నౌక

కాలాంతకులు

జీవన జ్యోతి

ప్రేమ బంధం

చెల్లెలి కాపురం

నిండు హృదయాలు

చిన్ననాటి స్నేహితులు

ఉండమ్మా బొట్టు పెడతా

కలసొచ్చిన ఆదర్శం

ప్రైవేటు మాస్టారు

శారద

కాలం మారింది

ఓ సీత కథ

శుభప్రదం