//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెత్త రాతలు రాసే మీలాగా కుసంస్కారిని కాదు నేను : రాఘవేంద్రరావు

Category : politics

నిన్న తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎంతో మంది ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా తమ విలువైన ఓటు వేశారు. అయితే హైదరాబాదు ఫిలింనగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు పరాభవం ఎదురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

నేరుగా బూత్ లోకి వెళ్తున్న ఆయనను ఓటర్లు అడ్డుకున్నారని, సెలెబ్రిటీ అయితే మాత్రం నేరుగా బూత్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు చెప్పారు. మీడియాతో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, 'క్యూలో నిలబడలేక నేను వెళ్లిపోయానని టీవీలో వచ్చింది. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది.

నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను. క్యూలో ఉన్న ఓటర్లు ఎవరూ నన్ను అభ్యంతరపెట్టలేదు. నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కారం కలిగిన వ్యక్తిని కాను అంటూ ఛానల్ పై మండిపడ్డారు.

మినిమం తెలియకుండానే వార్తలు రాయడంతోనే మీ మీ సంస్కారం ఏంటో అర్ధమవుతుంది. తెలిసి తెలియకుండానే మీ ఇష్టం వచ్చినట్లు రాసేస్తారు. మామీద ఇలాంటి తప్పు రాతలు రాసేముందు ముందు వెనక అలోచించి రాయాలి. మీడియా అనేది గౌరవ ప్రదమైనది వార్తలు కొంచెం భాద్యతగా రాయండి అని వెల్లడించారు. పోలింగ్ జరిపిన విధానం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు.

Related News