//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చౌహన్ దీక్షకు పోటీగా జ్యోతిరాదిత్య `సత్యగ్రహ'

Category : national

మెరుగైన ధరల కోసం రైతులు జరుపుతున్న ఆందోళన సందర్భంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్  శాంతి కోసం శనివారం నుండి నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించడంతో, రైతుల హక్కుల పరిరక్షణ కోసం పోటీగా కాంగ్రెస్ యంపీ జ్యోతిరాదిత్య సింధియా జూన్ 14 నుండి 72 గంటల సేపు `సత్యగ్రహ' చేయనున్నట్లు ప్రకటించారు. 

ఈ లోగా గతవారం నిరసన ప్రదర్శకులపై పోలీస్ లు జరిపిన కాల్పులలో మృతి చెందిన రైతుల కుటుంబాలను కూడా సింధియా కలసి పరామర్శ చేస్తారు. మరోవంక రాష్ట్రంలో రాష్త్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.  ముఖ్యమంత్రి తన రాజ్యాంగబద్ధ విధులను ప్రక్కన పెట్టి దీక్షకు దిగడంతో అధికారమలో కొనసాగే అధికారం లేదని స్పష్టం చేసింది.

 కాల్పులలో మృతి చెందిన ఒక రైతుకు 40 ఏళ్ళ కొడుకు ఉన్నాడని అంటూ దీక్ష పేరుతో తన బాధ్యతలను పట్టించుకోకుండా ఉండటం కాకుండా ముఖ్యమంత్రి వెళ్లి మృతుల కుటుంభం సభ్యులను పరామర్శించి తన రాజ్యాంగబద్ధ బాధ్యతలు నిర్వహించాలని రాష్త్ర అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ సూచించారు. బిజెపి మిత్రపక్షం శివ సేన కూడా చౌహన్ దీక్షలు కూర్చొనే బదులు మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి ఉండవలసినదని హితవు చెప్పింది.