Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాపుల కు జగన్ అన్యాయం...జ్యోతుల

Category : politics state

టీడీపీ సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాపులపై కక్ష సాధిస్తున్నారని పేరుకొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్‌లో 5% కాపులకు వర్తింపజేస్తూ తీర్మా నం చేసిందని.. కాగా జగన్ ఇప్పుడు కాపు లకు 5శాతం ఇవ్వడం సాధ్యపడదనడం వాళ్ళ పై కసి తీర్చుకో వడమేనని చెప్పుకొచ్చారు. జ్యోతుల నెహ్రూ ఆదివారం కాకినాడలో విలేకరులతో మాట్లాడారు.

ఈ నేపధ్యం లో ఆయన జగన్‌ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కాపులు కూడా కారణమన్నారు. అయితే టీడీపీ కాపులకు ఇచ్చిన రిజర్వేషన్‌ అమలు జరిగేలా చూడాలి, అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. తనకు నాయకత్వం ముఖ్యం కాదని.. కాపులకు న్యాయం చేయడమే ముఖ్యం అని చెప్పారు. చంద్రబాబు అమెరికా పర్యటన లో ఉన్నారు కనుక ఆయన తిరిగొచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక పెద్దలతో కలిసి 5% రిజర్వేషన్‌ సాధనపై చర్చిస్తామని తెలిపారు.

గోదావరి నీటిని తెలంగాణకు తరలించడం క్విడ్‌ప్రోకోలో భాగం. ఆంధ్రా వాటాకు వచ్చిన జలాలను తెలంగాణకు ఇవ్వటం ద్వారా రాష్ట్రానికి ద్రోహం అని అన్నారు. మన సొమ్ముతో మన నీటిని తెలంగాణకు తరలించాలని చూస్తున్నారు అని పేరుకొన్నారు.