//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ నేత‌లే వెన్నుపోటుపొడిచారు : జూప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Category : politics state

మ‌రికొద్ది సేపట్లో తెలంగాణాను మ‌రోసారి గులాబీరంగు అలుముకోనుంది. అందుకు కార‌ణం ఇవాళ జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే, ఓట్ల లెక్కింపులో భాగంగా తెరాస అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్ల‌లో త‌న ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా కూట‌మి అభ్యర్థులు ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రిచిన‌ప్ప‌టికీ అవి కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. దీంతో తెరాస గెలుపు ఖాయ‌మైంద‌ని ఇప్ప‌టికే రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అయితే, అత్య‌ధిక సీట్ల‌లో తెరాస ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రిచినా ఆ పార్టీ నుంచి మంత్రి స్థాయిలో ఉన్న కొంద‌రు ఎమ్మెల్యే అభ్య‌ర్థులే ఓట‌మిపాల‌వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలా ఓట‌మిని చ‌విచేసిన వారిలో జూప‌ల్లి కృష్ణారావు ఒక‌రు. ఈయ‌న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెరాస అభ్య‌ర్థిగా పోటీలో నిల‌బ‌డ్డారు.ఆప‌ద్ధ‌ర్మ మంత్రిగా ఉన్న జూప‌ల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి దాదాపు 3వేల ఓట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూశారు. 

ఓట‌మిపాల‌వడంపై స్పందించిన జూప‌ల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. త‌న‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌ట్నుంచి త‌మ పార్టీలోని కొంద‌రు నేత‌లు త‌న ఓటమే ల‌క్ష్యంగా ప‌నిచేశార‌న్నారు. తాను ఓడినందుకు బాధ‌ప‌డ‌టం లేద‌ని, త‌న వెన్నంటి ఉన్న తెరాస నేత‌లు కొంద‌రు త‌న‌ను వెన్నుపోటు పొడ‌వడాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నానంటూ మీడియా ముందు జూప‌ల్లి కృష్ణారావు వాపోయారు.