//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చైతన్య కృష్ణ వ్యూహంతో ఇరుకున పడుతున్న జూనియర్ ఎన్టీఆర్..!

Category : politics

ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం చల్ల బడటంలేదు.రోజుకొక ట్విస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి.దీనికితోడు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ పార్టీ వర్గాలు చంద్రబాబు పై చేస్తున్న ఆరోపణలతో టీడీపీ శ్రేణులు తీవ్రంగా కలత చెందుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో నందమూరి తారకరామారావు మనవడు జయకృష్ణ కొడుకు "చైతన్య కృష్ణ" తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు ధైర్యం చెబుతూ విడుదలచేసిన ఒక వీడియో నందమూరి అభిమానుల మధ్య వైరల్ గా మారింది.

తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ ని రక్షించుకోవలసిన పరిస్థుతులు ఆసన్నం అయ్యాయి అంటూ తెలుగుదేశం క్యాడర్ కోసం తాను త్యాగానికి అయినా సిద్ధం అంటూ ఆవేశ పూరితంగా చైతన్య కృష్ణ పిలుపు ఇచ్చాడు.గతంలో జగపతి బాబు హీరోగా వచ్చిన "ధమ్" చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు చైతన్యకృష్ణ.ఆ సినిమా ఘోర పరాజయం తరువాత అతను సినిమాలకు దూరం అయ్యాడు.అయితే ఎన్నికలు జరిగినప్పుడు ప్రతీసారి చైతన్య కృష్ణ అనేక చోట్ల ప్రచారం చేసాడు.ప్రస్తుతం చైతన్య కృష్ణ విడుదల చేసిన వీడియోను చూసిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇలాంటి పిలుపు జూనియర్ నుండి వస్తే తెలుగుదేశం తిరిగి చైతన్యవంతం అవ్వడం ఖాయం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కుదేలైన టీడీపీకి ఈ స్థితిలో "జూనియర్ ఎన్టీఆర్" సపోర్ట్ చాలా అవసరమని టీడీపీ శ్రేణుల్లో మరోసారి చర్చలు ప్రారంభం అయ్యాయి అని వార్తలు వస్తున్నాయి.అంతేకాదు చైతన్యకృష్ణ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ వీడియో రిలీజ్ చేస్తే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్న వారికి ముచ్చెమటలు పట్టడం ఖాయం అని నందమూరి అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను కూడ చైతన్య కృష్ణలా స్పందించమని వేల సంఖ్యలో ఎన్టీఆర్ కు మెసేజ్ లు పెడుతున్నట్లు సమాచారం. ఈ అనూహ్య స్పందన చూసి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోతున్నట్లు టాక్.