//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జడ్జిల జీతాల పెంపు మరిచారా?

Category : national

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచేందుకు తగు చర్యలు చేపట్టడం కేంద్రప్రభుత్వం విస్మరించిందా అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఏడో వేతన సంఘ సిఫారసుల ప్రకారం కేంద్రప్రభుత్వ అధికారులు, సిబ్బందితో సమానంగా న్యాయమూర్తులకు కూడా వేతనాలు పెంచే విషయం ఎంతవరకు వచ్చిందని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ నరసింహను బుధవారం అడిగింది. సుప్రీంకోర్టు సిబ్బందికి, అధికారులకు వాషింగ్‌ అలవెన్సు పెంపు కేసు విచారణ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించింది.

న్యాయమూర్తుల వేతనాలు పెంచేందుకు కేంద్రం గత మార్చిలోనే ఆమోదించింది. చట్టసవరణ చేస్తేనే వారి వేతనాలు పెరుగుతాయి. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు తర్వాత కేంద్ర అధికారుల వేతనాలు బాగా పెరిగాయి. న్యాయమూర్తుల జీతాల కంటే ఎంతో ఎక్కువగా కూడా ఉన్నాయి.దీనిపై ఈ నెల 14న కోర్టుకు తెలియజేస్తానని నరసింహ తెలియజేశారు.