క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి 2018 IPL 11వ సీజన్ సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంబం కానుంది. ధనాధన్ క్రికెట్‌కు మారు పైరైన ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ సంస్థ పలు స్థానిక భాషల్లో ఈ సీజన్‌ని ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఐపీఎల్‌ను తెలుగులోకి కూడా తీసుకురానున్నారు. అందులో భాగంగానే తెలుగు ఐపీఎల్ ప్రచారకర్తగా టాలీవుడ్ యంగ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని నియమించింది. దీంతో ఐపీఎల్ తెలుగు ప్రసారానికి సంబంధించి ఎన్టీఆర్‌తో పాటు ఇద్దరు తెలుగు కమెడియన్లతో ఉన్న ఓ ప్రోమోని తాజాగా స్టార్ ఛానల్ విడుదల చేసింది.
# అసలు మజా తెలుగురా.. చాలు బాబోయ్ ఒప్పేసుకున్నాం..!
ఇక ఒకసారి ఆ ప్రోమో పై కన్నేస్తే.. ఎన్టీఆర్ తనదైన శైలీలో ఓ డైలాగ్ చెప్పి అలరించారు. వీవో ఐపీఎల్ ఈ ఏడాది తెలుగులో వస్తుందిరా అంటూ కమెడియన్ హేమంత్ అనగా.. వెంటనే అందుకున్న మరో కమెడియన్ మధు టీవీలో వస్తే చాలు గదరా తెలుగులో ఏంటి స్పెషల్ అని అనగానే.. జూనియర్ ఎన్టీఆర్ అందుకుంటూ తెలుగులో అయితే ఏంటా.. కారంలేని కోడి.. ఉల్లిపాయలేని పకోడి.. పెట్రోల్ లేని గాడి.. మీసాలు లేని రౌడి.. పరిగెత్తడం రాని కేడీ.. ఆవకాయలేని జాడీ.. ఆటల్లేని బడి..అమ్మ ప్రేమలేని వడి.. అంటూ అదిరిపోయే డైలాగ్స్ చెప్పడంతో అక్కడే ఉన్న హేమంత్ చాలురా బాబు ఓప్పేసుకున్నాం అంటూ దండం పెట్టేశాడు. దీంతో అసలు మజా తెలుగురా అంటూ ఎన్టీఆర్ సూపర్ ఫినిషింగ్ టచ్చ్ ఇవ్వడంతో ఈ ప్రోమో ఎండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఇక తెలుగులో ఐపీఎల్ స్టార్ మా మూవీస్ ఛానల్లో ప్రసారం కానుంది. ఈ నెల 7వ తేదిన ఐపీఎల్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది.