//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ వైర‌ల్ ట్వీట్‌.. సారీ అభ‌య్.. నేను నిన్ను కాపాడ‌లేక పోతున్నాను..!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగ‌న్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తన కుమారుడు అభయ్ రామ్ ముచ్చట్లని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ త‌న అభిమానులతో నిత్యం ట‌చ్‌లో ఉంటాడు. తాజాగా తన సతీమణి లక్ష్మి ప్రణతి, అభయ్ రామ్ అందమైన ఫోటోని ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ పిక్ వైరల్ గా మారింది. లక్ష్మీ ప్రణతి తన కొడుకు పట్ల ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆమె నుంచి నేను కూడా అభయ్ ని కాపాడలేనని సరదాగా కామెంట్ చేశాడు.

ప్రతిరోజు పాలు తాగడానికి చాలా మంది చిన్నపిల్లలు మారం చేస్తుంటారు. లక్ష్మి ప్రణతి మాత్రం అభ‌య్‌ని అంత సులువుగా విడిచిపెట్టేలా లేదు. అభయ్‌ని కూర్చో బెట్టి మరి పాలు తాగిస్తోంది. చేసేది లేక బిక్కు బిక్కుమంటూ తాగలేక పాలు తాగుతున్న అభయ్ రామ్ చూపులు అమాయకంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ పట్ల తన భార్య ఎంత కేర్ తీసుకుంటుందో ఎన్టీఆర్ చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత రాయ‌ల‌సీమ నేప‌ధ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం పై సినీ వార్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.